సమాజానికి ఉపయోగపడేలా పరిశోధనలు | Sakshi
Sakshi News home page

సమాజానికి ఉపయోగపడేలా పరిశోధనలు

Published Thu, Apr 18 2024 10:35 AM

భార్గవికి పట్టాను అందజేస్తున్న యూనివర్సిటీ 
చాన్స్‌లర్‌ పురుషోత్తమ్‌రెడ్డి   - Sakshi

మొయినాబాద్‌రూరల్‌: ప్రస్తుత కాలంలో సమాజానికి ఉపయోగపడే పరిశోధనలు చేయాలని చెతన్య డీమ్డ్‌ టూబీ యూనివర్సిటీ చాన్స్‌లర్‌ డాక్టర్‌ పురుషోత్తమ్‌రెడ్డి, చీఫ్‌ అడ్మినిస్ట్రేట్‌ అధికారి సాత్వికరెడ్డి పేర్కొన్నారు. బుధవారం మండల పరిధిలోని హిమాయత్‌నగర్‌ గ్రామ సమీపంలో గల యూనివర్సిటీలో భార్గవి, ప్రశాంత్‌రాజాలు డాక్టరేట్‌ పొందారు. సుక్ష్మ జీవశాస్త్ర విభాగంలో ‘ఎవాల్యూవేషన్‌ ఆఫ్‌ యాంటీ బ్యాక్టిరియా ఎన్‌డీ యాంటీ బయోఫిల్మి పోటేన్షియల్‌ ఆఫ్‌ సెలెక్టేడ్‌ ప్లాంటీ ఎక్స్‌లెన్స్‌ ఎగ్రినేస్ట్‌ డిగ్రీ రెసిస్టెంట్‌ పాతోజేన్స్‌’ అనే అంశంపై ప్రొఫెసర్‌ బి.శ్రీలత పర్యవేక్షణలో భార్గవి పరిశోధన చేశారు. అదే విధంగా రసాయన శాస్త్ర విభాగంలో ‘సిందాసిస్‌ అండ్‌ బయోలాజికల్‌ ఎలివేషన్‌ ఆఫ్‌ నైట్రోజన్‌ బెస్ట్‌ ఎటేరో సక్లిస్ట్‌’ అనే అంశంపై ప్రొఫెసర్‌ జగదీష్‌కుమార్‌ పర్యవేక్షణలో ప్రశాంత్‌రాజ్‌ పరిశోధన చేశారు. ఈ సందర్భంగా వీరికి డాక్టరేట్‌ పట్టాను అందించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ రవీందర్‌, కవిత, రిసర్చ్‌ డీన్‌ కిష్టఫర్‌, డిన్‌ సైన్స్‌ ప్రొఫెసర్‌ సుందర్‌రామ్‌, అడ్మినిస్ట్రేషన్‌ రాజు, పబ్లిక్‌ రిలేషన్‌ అధికారి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

చైతన్య డీమ్డ్‌ యూనివర్సిటీచాన్స్‌లర్‌ డాక్టర్‌ పురుషోత్తమ్‌రెడ్డి

Advertisement
Advertisement