పీహెచ్‌డీ ఉ‍న్నా కూరగాయల అమ్మకం | Sakshi
Sakshi News home page

‘పీహెచ్‌డీ సబ్జీవాలా’: ఉద్యోగం కంటే.. కూరగాయల అమ్మకంతోనే..

Published Mon, Jan 1 2024 3:05 PM

 Punjab Man With PhD Four Masters Degrees Sells Vegetables - Sakshi

ప్రైవేట్‌ జాబ్‌లు చేసి.. అవి నచ్చక వ్యాపారం చేసినవారిని చూశాం. చాలీచాలని జీతాలకు కుటుంబాలను పోషించలేక పలు ఆదాయ మార్గాలను వెతుకున్న ప్రైవేట్‌ టీచర్లు, లెక్చరర్లకు సంబంధించిన వార్తలు కూడా చదివాం. అయితే తాగాజా ఓ వ్యక్తి నాలుగు మాస్టర్‌ డిగ్రీలు తీసుకొని.. ఏకంగా న్యాయశాస్త్రంలో పీహెచ్‌డీ చేసి కూరగాయలు అమ్ముతున్నారు. ఈ విషయం నెట్టింట్లో వైరల్‌ అవుతోంది. 

పంజాబ్‌కు చెందిన డా.సందీప్‌ సింగ్ పంజాబ్‌ యూనివర్సిటీలో కాంట్రాక్టు ప్రోఫెసర్‌గా పని చేసేవారు. అనుకోని పరిసస్థితుల్లో ఆయన తన ఉద్యోగం మానేసి ఇల్లూఇల్లు తిరుగుతూ కురగాయలు అమ్ముతున్నారు. యూనివర్సిటీలోని లా డిపార్టుమెంట్‌లో 11 ఏళ్లపాటు పనిచేసిన సందీప్‌ సింగ్‌ నాలుగు మాస్టర్‌ డిగ్రీలు(న్యాయ శాస్త్రం, పంజాబీ, జర్నలిజం, పొలిటికల్‌ సైన్స్)తో పాటు లా కోర్సులో పీహెచ్‌డీ పూర్తి చేశారు.

ఇన్నేళ్లపాటు కాంట్రాక్టు ఉద్యోగం చేసిన సందీప్‌ నెలవారి జీతాల విషయంలో చాలా ఇబ్బందుల ఎదుర్కొన్నారు. జీతాల తగ్గింపు, సరైన సమయానికి సాలరీ రాకపోవటం వంటివి ఆయన్ను తీవ్రంగా వెంటాడాయి. చేసేదేంలేక కూరగాయల అమ్మకాన్ని మొదలుపెట్టారు డా. సందీప్‌. తాను ఇల్లూ ఇల్లు తిరిగి కూరగాయలు అమ్మె బండికి వినూత్నంగా ‘పిహెచ్‌డీ సబ్జీవాలా’ అని పేరు పెట్టుకున్నారు.

పంజాబ్‌లోని పాటియాలకు చెందిన సందీప్‌.. ఉద్యోగం కంటే కూడా కూరగాయలు అమ్మటం వల్లనే తాను ఎక్కువగా డబ్బు సంపాదిస్తున్నట్లు చెప్పటం గమనార్హం. మరోవైపు తాను మరో మాస్టర్‌ డిగ్రీ కోసం చదువకుంటూ.. కూరగాలయలు అమ్మగా వచ్చిన మొత్తంతో టీచింగ్‌ వృత్తిని మానుకోకుండా పిల్లలకు ట్యూషన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తానని చెప్పుకొచ్చారు. 
చదవండి: Punjab: వృద్ధులకు నజరానా ప్రకటించిన పంజాబ్‌ ప్రభుత్వం

Advertisement
Advertisement