ఏపీలో పథకాలకు నిధుల విడుదల ప్రారంభం | Andhra Pradesh Govt Released DBT Amount Updates | Sakshi
Sakshi News home page

సంక్షేమ పథకాల లబ్ధిదారులకు ఊరట.. ఏపీలో పథకాలకు నిధుల విడుదల ప్రారంభం

Published Thu, May 16 2024 10:17 AM | Last Updated on Thu, May 16 2024 11:15 AM

Andhra Pradesh Govt Released DBT Amount Updates

విజయవాడ, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ పథకాల లబ్ధిదారులకు ఊరట ఇస్తూ.. డీబీటీ(నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే నగదు జమ) పథకాలకు నిధుల విడుదల ప్రారంభం అయ్యింది. నిన్న ఒక్కరోజే ఆసరాకు రూ.1,480 కోట్లు, జగనన్న విద్యాదీవెన కింద సంపూర్ణ ఫీజు రింబర్స్ మెంట్కు రూ.502 కోట్లు విడుదల అయ్యాయి. రెండు మూడు రోజుల్లో మిగిలిన పథకలకూ నిధుల్ని విడుదల చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. 

ఇదిలా ఉంటే.. ఎన్నికల వేళ నిధులు విడుదల కాకుండా తెలుగు దేశం పార్టీ కుట్రలు చేసింది. ఈసీకి ఫిర్యాదు చేయడం.. ఆ వెంటనే ఈసీ సైతం డీబీటీ నిధులు విడుదలకు  చేయకుండా ఆదేశాలిచ్చింది. దీంతో.. ఎన్నికల సంఘంపై ఏపీ ప్రభుత్వం కోర్టుకు వెళ్లింది. అయితే విచారణ సందర్భంగా ఈసీ తీరుపై కోర్టు ఆగ్రహం వెల్లగక్కింది. 

ఈలోపే పోలింగ్‌ తేదీ వచ్చేయడంతో నిధుల విడుదల ఆగిపోయింది. ఇప్పుడు పోలింగ్‌ ముగియడంతో నిధుల విడుదల తిరిగి ప్రారంభం అయ్యింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement