వైట్‌హౌస్‌కు ఏఐ టెక్నాలజీని పరిచయం చేసిన భారత సంతతి ఇంజనీర్‌! ఎవరీమె? | Sakshi
Sakshi News home page

వైట్‌హౌస్‌కు ఏఐ టెక్నాలజీని పరిచయం చేసిన భారత సంతతి ఇంజనీర్‌! ఎవరీమె..?

Published Wed, May 8 2024 6:41 PM

Arati Prabhakar Who Introduced AI Technology To The White House

ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ శరవేగంగా విస్తరిస్తోంది. అన్నిరంగాల్లో దీని హవానే నడుస్తుంది అన్నంతగా సరికొత్త టెక్నాలజీతో దూసుకుపోతుంది. అలాంటి టెక్నాలజీని అమెరికా శ్వేతసౌధానికి పరిచయం చేసింది మన భారత సంతి అమెరికన్‌ ఆరతి ప్రభాకర్‌. అక్కడ ఆమె కీలకమైన బాధ్యతలు చేపట్టిన  తొలి భారతీయ అమెరికన్‌గా కూడా చరిత్ర సృష్టించింది. ఎవరీ ఆరతీ ప్రభాకర్‌? ఆమె నేపథ్యం ఏంటంటే..

ఇంజనీర్‌ కమ్‌ సామాజిక కార్యకర్త అయిన ఆరతి ప్రభాకర్‌ భవిష్యత్తులో ఏఐ హవా గురించి వైట్‌హౌస్‌లో పరిచయం చేయడంలో కీలక పాత్ర పోషించారు. 2022లో ఆరతిని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ వైట్‌ హౌస్‌ ఆఫీస్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ పాలసీ(ఓఎస్‌టీపీ) డైరెక్టర్‌ అండ్‌ సైన్స్‌ అడ్వైజర్‌గానూ నియమించారు. దీంతో ఆరతి ఈ అత్యున్నత పదవిలో పనిచేస్తున్న తొలి భారతతి సంతతి అమెరికన్‌గా చరిత్ర సృష్టించింది. ఆమె ఓఎస్‌టీపీ డైరెక్టర్‌గా సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఇన్నోవేషన్‌లకు సంబంధించిన విషయాలపై రాష్ట్రపతికి సలహా ఇవ్వడంలో  కీలకపాత్ర పోషిస్తుంది. 

వైట్‌హైస్‌లో అందించే సేవలు..
ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ) నియంత్రణకు సంబంధించిన విధానాలను రూపొందించడంలో చురుకుగా పాల్గొంటారు. ఆమె అక్కడ ఏఐ అపార సామార్థ్యాన్ని గుర్తించడమే గాక దాని వల్ల ఎదురయ్యే నష్టాలను సమర్థవంతంగా నిర్వహించవలసిన అవసరాన్ని గురించి నొక్కి చెబుతుంది. ఆమె బైడెన్‌ పరిపాలనకు సంబంధించిన ఏఐ భద్రత, గోప్యత, వివక్షను పరిష్కరించడానికి ముఖ్యమైన చర్యలు తీసుకుంటుంది. నిజానికి ఆమె ఓవెల్‌ ఆఫీస్‌లో ల్యాప్‌టాప్‌ని ఉపయోగించి ప్రెసిడెంట్ జో బైడెన్‌కి చాట్‌జిపిటి గురించి వివరించడంతోనే వెట్‌హౌస్‌లో దీని ప్రాముఖ్యత ఉందని గుర్తించారు బైడెన్‌. 

ఆ తర్వాత ఆరునెల్లలోనే అధ్యక్షుడు బైడెన్‌ ఏఐ భద్రత గోప్యత, ఆవిష్కరణలపై దృష్టి సారించేలా కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. ఈ ఉత్తర్వు ఏఐ కొత్త ప్రమాణాలను ఏర్పాటు చేస్తుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏఐలో అమెరికన్ నాయకత్వాన్ని అభివృద్ధి  చేయడం తోపాటు వివక్ష నుంచి రక్షిస్తుంది. ఇక ఆరతి ఈ ఏఐ అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో అమెరికా అధ్యక్షుడికి సమగ్ర వ్యూహాలు, సలహాలు అందిస్తుంది. 

ఆమె నేపథ్యం..
ఢిల్లీలో పుట్టిన ఆరతి.. మూడేళ ప్రాయంలో ఉండగానే ఆమె కుటుంబం అమెరికాకు వెళ్లింది. టెక్సాస్‌లోని లుబ్బాక్‌లో పెరిగారు. ఆమె ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో పట్టా పొందారు. ఆ తర్వాత అప్లైడ్‌ భౌతిక శాస్త్రంలో పీహెచ్‌డీ పూర్తి చేశారు. దీంతో 1984లో కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి అప్లైడ్‌ భౌతిక శాస్త్రంలో పీహెచ్‌డీ చేసిన తొలి మహిళగా ఆరతి చరిత్ర సృష్టించింది. ఆమె డాక్టరల్ అధ్యయనాల తదనంతరం వాషింగ్టన్‌ డీసీలో కాంగ్రెస్‌ ఫెలోషిప్‌ను పూర్తి చేసింది.  

(చదవండి: మిస్‌ యూనివర్స్‌​ అందాల పోటీల్లో 60 ఏళ్ల వృద్ధురాలు..!)


 

 
Advertisement
 
Advertisement