'చొక్కా చింపేసిన' రాహుల్‌! | what Rahul Gandhi said on Modi kurta | Sakshi
Sakshi News home page

'చొక్కా చింపేసిన' రాహుల్‌!

Jan 16 2017 7:04 PM | Updated on Aug 21 2018 9:33 PM

'చొక్కా చింపేసిన' రాహుల్‌! - Sakshi

'చొక్కా చింపేసిన' రాహుల్‌!

రానున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు.

  • నా కుర్తా చినిగిపోయింది!
  • మోదీ కుర్తా ఎప్పుడైనా చినిగిందా?

  • రానున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆయన తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఉత్తరాఖండ్‌ రిషికేష్‌లో ఎన్నికల సభలో ప్రసంగించిన రాహుల్‌ యథాలాపంగా ప్రధాని మోదీపై విమర్శల వర్షం కురిపించారు. పెద్దనోట్ల రద్దుపై మోదీని దుయ్యబడుతూ ప్రసంగాన్ని ఎక్కుపెట్టిన ఆయన.. అకస్మాత్తుగా మైక్‌ నుంచి కొంచెం ముందుకొచ్చి.. చినిగిన తన కుర్తా (చొక్కా)ను చూపించారు.

    'చూడండి నా కుర్తా చినిగిపోయింది. కానీ మోదీజీ కుర్తా ఎప్పుడూ చినిగిపోయినట్టు మీకు కనిపించదు. ఆయన సంపన్నులు, ధనికులతోనే కనిపిస్తారు' అని రాహుల్‌ పేర్కొన్నారు. రాహుల్‌ ఇలా చినిగిన చొక్కాను జనానికి చూపించడంతో వారి నుంచి పెద్ద ఎత్తున ప్రతిస్పందన వచ్చింది. రాహుల్‌ మాట్లాడుతూ 'నేను పేదల కోసం రాజకీయాలు చేస్తున్నా. మోదీ ఫొటోలు ఎప్పుడూ సంపన్నులతోనే ఉంటాయి' అని అన్నారు. పెద్దనోట్ల రద్దుతో ఆర్బీఐ లాంటి స్వతంత్ర సంస్థను మోదీ చంపేశారని రాహుల్‌ మండిపడ్డారు. మోదీ చేయాల్సింది యోగా కాదు తపస్సు అంటూ ఎద్దేవా చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement