గోల్డెన్ బే రిసార్ట్స్ వద్ద తీవ్ర ఉద్రిక్తత | Sakshi
Sakshi News home page

గోల్డెన్ బే రిసార్ట్స్ వద్ద తీవ్ర ఉద్రిక్తత

Published Sat, Feb 11 2017 9:48 AM

గోల్డెన్ బే రిసార్ట్స్ వద్ద తీవ్ర ఉద్రిక్తత - Sakshi

మద్రాస్ హైకోర్టు ఆదేశాలను అమలు చేయడానికి వెళ్లిన పోలీసులను అక్కడివాళ్లు అడ్డుకోవడంతో కువత్తూర్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మహాబలిపురం సమీపంలోని ద్వీపంలో ఉన్న గోల్డెన్ బే రిసార్ట్స్‌లో ఉన్న ఎమ్మెల్యేలను బయటకు తీసుకు రావాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. లోపల ఉన్నవారిని బయటకు తెచ్చేందుకు ప్రయత్నించారు. అయితే, శశికళ వర్గీయులతో పాటు కువత్తూర్‌కు చెందిన స్థానికులు కూడా పోలీసుల చర్యలను అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అక్కడకు వెళ్లిన మీడియా వర్గాల మీద కూడా లోపల ఉన్నవారు రాళ్లతో దాడి చేశారు. డీఎస్పీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేల కోసం సెర్చ్ ఆపరేషన్ మొదలైంది. డీఆర్వో కూడా అక్కడకు తమ సిబ్బందితో చేరుకున్నారు. భారీ సంఖ్యలో పోలీసులు అక్కడకు వెళ్లడంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తాయి.
 
గోల్డెన్ బే రిసార్ట్స్ నుంచి అధికారులను గ్రామస్తులు బయటకు పంపేశారు. మరోవైపు లోపల ఉన్న ఎమ్మెల్యేలను మరో మార్గం గుండా బయటకు తీసుకొచ్చి, వారిని బెంగళూరు లేదా హైదరాబద్ తరలించేందుకు శశికళ వర్గం వ్యూహం పన్నుతున్నట్లు తెలుస్తోంది. వాళ్లు బయటకు వస్తే పన్నీర్ సెల్వం టీమ్‌లో చేరుతారన్నది శశి వర్గం ఆందోళనగా కనిపిస్తోంది. ఇదంతా రాజ్యాంగ సంక్షోభమేనని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కొన్ని పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. 

సంబంధిత వార్తలు చదవండి

గవర్నర్‌ నిర్ణయం లేటు..ఎవరికి చేటు? ఎవరికి సీటు?

పోయెస్ గార్డెన్ వెలవెల

పన్నీర్కే 95 శాతం మద్దతు!

ఎత్తుకు పైఎత్తు

నేను ముఖ్యమంత్రి కావడం ఖాయం

 

Advertisement
Advertisement