ఎవరెస్టుపై 18 మంది మృతి | Sakshi
Sakshi News home page

ఎవరెస్టుపై 18 మంది మృతి

Published Sun, Apr 26 2015 1:27 PM

ఎవరెస్టుపై 18 మంది మృతి - Sakshi

నేపాల్:  హిమాలయ పర్వతాలను చుట్టేసిన భూకంపం కారణంగా ఎవరెస్టు శిఖరంపై 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం పర్వతారోహణ సమయం కావడంతో ప్రమాదం అంచనా వేయని వీరంతా ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించాలనే ఉద్దేశంతో సాహసయాత్ర ప్రారంభించి ప్రమాద బారిన పడ్డారు. వీరిలో చాలామంది బ్రిటన్ దేశస్థులే ఉన్నారు. వీరిలో ప్రధానంగా గూగుల్ సంస్థకు చెందిన సీనియర్ అధికారి డేనియల్ ఫ్రెడిన్ బర్గ్ (33), న్యూజెర్సీకి చెందిన డాక్టర్ మరిసా ఈవ్(29) వంటివారు కూడా ఉన్నారు. మిగితా వారిని గుర్తించాల్సి ఉంది. భారీ భూకంపం సంభవించి నేపాల్ కకావికలమైన విషయం తెలిసిందే.

Advertisement
Advertisement