
ప్రముఖ కవి పాటిబండ్ల కన్నుమూత
నిజామాబాద్‌లోని ఖలీల్‌వాడికి చెందిన ప్రముఖ కవి, రచయిత, శతాధిక వృద్ధుడు పాటిబండ్ల వెంకటపతిరాయులు(101) సోమవారం మృతి చెందాడు.
నిజామాబాద్ కల్చరల్: నిజామాబాద్‌లోని ఖలీల్‌వాడికి చెందిన ప్రముఖ కవి, రచయిత, శతాధిక వృద్ధుడు పాటిబండ్ల వెంకటపతిరాయులు(101) సోమవారం మృతి చెందాడు. కృష్జా జిల్లాలో జన్మించిన ఆయన ఉభయ భాషాప్రవీణుడు. తెలుగు, హిందీ, సంస్కృతంలో ప్రవీణ్యం ఉంది. ఆయన పలు పుస్తకాలు సైతం రాశారు. పాటిబండ్ల మృతి విషయం తెలుసుకున్న పలువురు కళాకారులు, సాహితీవేత్తలు సంతాపం తెలిపారు.