షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదాలు | Sakshi
Sakshi News home page

షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదాలు

Published Tue, Sep 30 2014 11:57 PM

fire accidents with short circuit

నారాయణఖేడ్/ మెదక్ రూరల్ : జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో  జరిగిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ ఇల్లు పాక్షికంగా దగ్ధం కాగా, టెంట్ హాస్, మీసేవ కేంద్రంతోపాటు ఫొటో స్టూడియో పూర్తిగా తగలబడి పోయింది. వివరాలు ఇలా ఉన్నాయి.. నారాయణ ఖేడ్ పట్టణంలోని మార్వాడిగల్లిలోని ఓ ఇల్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా దగ్ధమై పాక్షికంగా నష్టం జరిగింది. ఈ సంఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.

 మా ర్వాడిగల్లిలో నివాసం ఉంటున్న అవుసలి రవి కుటుంబ సభ్యులతో సోమవారం రాత్రి దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గల్లీలోని దేవీ మండపం వద్ద పూజలు చేసేందుకు వెళ్లారు. కాగా రవి ఇంట్లోని టీవీకి ఉన్న విద్యుత్ తీగల వద్ద షార్ట్‌సర్క్యూట్ జరిగి విద్యుత్ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో ఒక్క సారిగా మంటలు వ్యాపించాయి. ఇది గమనించిన స్థానికులు సంఘటనను రవి కుటుంబీకులకు సమాచారం అందిం చారు.

వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వగా ఫైరింజన్‌ను తరలించి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ టీవీ, ఇంట్లోని ఇతర వస్తువులు కాలిపోయాయి. విద్యుత్ షార్‌‌ట సర్క్యూట్ కారణంగా మెదక్ జిల్లా మండల పరిధిలోని భూర్గుపల్లి గ్రామంలో సోమవారం రాత్రి రెండు దుకాణాలు దగ్ధమయ్యాయి.  వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన సం తోష్ ఓ గదిలో టెంట్ హౌస్‌తో పాటు ఫొటో స్టూడియో, మీ సేవ కేంద్రాన్ని  నడుపు తూ  జీవనం కొనసాగిస్తున్నాడు. రోజు లాగే రాత్రి 9 గంటల ప్రాంతంలో షాపులను మూసివేసి అదే గ్రామంలో నివాస గృహానికి వెళ్లాడు.

 ఈ క్రమంలో సుమారు పది గంటల ప్రాంతంలో షాపు ల నుంచి పొగలు వస్తుండడంతో గ్రామస్తులు షాపు యజమాని సంతోష్‌కు చె ప్పారు. దీంతో అతను గ్రామస్తుల సహకారంతో షాపును తెరవగా అందులో ఉన్న టెంట్ బట్టలు, ఫొటో స్టూడియోకు సంబంధించిన మూడు కెమెరాలు, మీ సేవకు సంబంధించిన కంప్యూటర్, 3 ప్రింటర్లు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యా యి. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బం ది వచ్చి మంటలను అదుపు చేసినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

 ఈ ప్రమాదంలో రూ. 4 లక్షల ఆస్తి నష్టం జరగ్గా రెండు గదులు సైతం పూర్తిగా కాలి నెర్రెలు బారాయి. ఈ ప్ర మాదంలో మొత్తం రూ. 7.40 లక్షల భా రీ ఆస్తి నష్టం సంభవించినట్లు బాధితు లు తెలిపారు. విషయం తెలుసుకున్న ఆర్‌ఐ ప్రసాద్, వీఆర్‌ఓ ఆనందంలు ఘ టనా స్థలికి చేరుకుని పంచనామా నిర్వహించారు. కాగా తనను ప్రభుత్వం ఆ దుకోకుంటే ఆత్మహత్య తప్ప మరోమార్గం లేదని బాధితుడు  తెలిపాడు.

Advertisement
Advertisement