
పురందేశ్వరికి కీలక పదవి
ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరికి ఆ పార్టీలో జాతీయ స్థాయి పదవి లభించింది.
న్యూఢిల్లీ: ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరికి ఆ పార్టీలో జాతీయ స్థాయి పదవి లభించింది. బీజేపీ జాతీయ మహిళా మోర్చా ఇంఛార్జ్గా పురందేశ్వరిని నియమించారు.
కర్ణాటక మహిళా మోర్చా ఇంఛార్జ్గా పురందేశ్వరికి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇక బీజేపీ జాతీయ యువ మోర్చా ఇంఛార్జ్గా మురళీధరరావును నియమించారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల ఇంఛార్జ్గా మురళీధరరావుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జ్గా సిద్ధార్థ్నాథ్ సింగ్, తెలంగాణ ఇంఛార్జ్గా కృష్ణదాసులను నియమించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఈ నియామకాలను ఖరారు చేశారు.