ఆ చీకటి రాత్రిని మరచిపోలేం!

ఆ చీకటి రాత్రిని మరచిపోలేం! - Sakshi


► 1975 ఎమర్జెన్సీ రోజులపై ప్రధాని మోదీ

► ముస్లింలకు రంజాన్‌ శుభాకాంక్షలు

► ‘మన్‌కీ బాత్‌’లో ప్రసంగం




న్యూఢిల్లీ: ‘ఎమర్జెన్సీ విధించిన రోజు ఏ ప్రజా స్వామ్య ప్రేమికుడూ మరచిపోలేని చీకటి రాత్రి. ప్రజాస్వామ్యమంటే ఓ వ్యవస్థ మాత్ర మే కాదు... మన సంస్కృతి కూడా. దాన్ని కాపాడుకోవడానికి నిరంతర నిఘా అవసరం’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటిం చారు. 1975 జూన్‌ 25న నాటి ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ‘ఎమర్జెన్సీ’ని గుర్తు చేసుకుంటూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.


ప్రతి నెలా రేడియోలో ప్రసారమయ్యే ‘మన్‌కీ బాత్‌’ లో భాగంగా మోదీ మాట్లాడుతూ... ప్రజా స్వామ్యానికి హాని కలిగించే ఇలాంటి ఘటన లను తప్పకుండా గుర్తుపెట్టుకుని, దాని పటిష్టత కోసం ముందుకు సాగాల న్నారు. అత్యవసర పరిస్థితుల్లో దేశమంతా ఓ కారా గారంలా మారిపోయిందని, ఏ భారతీ యుడూ ఆ చీకటి రోజులను మరి చిపోలేడని చెప్పారు. ‘జయప్రకాష్‌ నారాయణ్, వాజ్‌పేయి వంటి ఎంతో మంది ప్రముఖ నాయకులను జైల్లో పెట్టారు.


ఆ సమయంలో కనీసం న్యాయ వ్యవస్థ కూడా ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. మీడియా మొత్తం నిష్ఫలంగా మారిపోయింది’ అంటూ నాడు వాజ్‌పేయి రాసిన ఓ కవితను మోదీ చదివి వినిపించారు. ‘దేశవ్యాప్తంగా రగిలిన ఉద్యమంతో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని ఎత్తివేయాల్సి వచ్చింది. ప్రజాస్వామికులు భారీఎత్తున పోరాడారు. అనంతర ఎన్నికల్లో దాని ప్రభావం కనిపించింది. ఇదీ మన వారసత్వ సంపద. దాన్ని బలోపేతం చేసుకోవాలి’అని మోదీ పిలుపునిచ్చారు.



భిన్నత్వమే భారత్‌ బలం...

దేశ ప్రజలకు ప్రధాని రంజాన్‌ పండుగ శుభాకాంక్షలు చెప్పారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఇలాంటి పవిత్రమైన పండు గల నుంచి స్ఫూర్తి పొందాలని పిలుపుని చ్చారు. భిన్నత్వమే భారత్‌ ప్రత్యేకతని, అదే బలమని అన్నారు. అలాగే దేశవ్యాప్తంగా ఆదివారం జరిగిన జగన్నాథ యాత్ర సందర్భంగా కూడా శుభాకాంక్షలు తెలిపారు. పేదవారు ఆరాధించే జగన్నాథస్వామి ఆలయ సంప్రదాయంలో సామాజిక న్యాయం వంటి అంశాలు ముడిపడి ఉన్నాయన్నారు.



మదురై మహిళ సాధికారత...

‘గవర్నమెంట్‌ ఈ–మార్కెట్‌ప్లేస్‌’ఆన్‌లైన్‌ పోర్టల్‌ ద్వారా వస్తువులు అమ్ముతున్నా నంటూ తమిళనాడు మదురైకి చెందిన ఓ మహిళ రాసిన ఉత్తరాన్ని ప్రధాని ప్రస్తావించారు. మహిళా సాధికారతకు ఇది నిదర్శనమని, ఆమె నుంచి ప్రధాని కార్యాల యం కూడా రెండు వస్తువులు కొనుగోలు చేసిందని మోదీ చెప్పారు.



విజయనగరం జిల్లాకు ప్రధాని ప్రశంసలు...

ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛభారత్‌ కార్యక్ర మం ఇప్పుడు ఓ ప్రజా ఉద్యమంలా మారిందని ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ఇందుకు ఆంధ్రప్రదేశ్‌లోని విజయ నగరం జిల్లాను ఉదహరించారు. స్థానిక ప్రజల భాగస్వామ్యంతో జిల్లా యంత్రాం గం జిల్లాలోని 71 గ్రామాల్లో 100 గంటలు నిర్విరామంగా శ్రమించి 10 వేల మరుగు దొడ్లను నిర్మించారని ప్రశంసించారు. గత మార్చి 10 ఉదయం 6 గంటలకు ఈ మిషన్‌ను ప్రారంభించి విజయవంతంగా పూర్తిచేశారన్నారు.


వీటి నిర్మాణం వల్ల 71 గ్రామాలు బహిరంగ మలవిసర్జన రహితంగా మారాయన్నారు. అలాగే... ముస్లింల ప్రాబల్యం ఉన్న ఉత్తరప్రదేశ్‌ బిజనౌర్‌ జిల్లాలో 3,500 కుటుంబాలున్న ముబారక్‌పూర్‌ గ్రామ ప్రజలంతా కలసి రంజాన్‌ సందర్భంగా మరుగుదొడ్డి నిర్మించారని మోదీ కొనియాడారు. దీనికి కేంద్రం రూ.17 లక్షలు మంజూరు చేసింద న్నారు. అయితే వారు ఆ డబ్బంతా ప్రభుత్వానికి తిరిగిచ్చేశారన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top