మహేష్బాబుకు సూర్య ఛాలెంజ్! | Sakshi
Sakshi News home page

మహేష్బాబుకు సూర్య ఛాలెంజ్!

Published Tue, Sep 16 2014 4:24 PM

మహేష్బాబుకు సూర్య ఛాలెంజ్!

తమిళనాడు నుంచి తెలుగు ప్రేక్షకుల వరకు అందరి మది దోచిన విలక్షణ నటుడు సూర్య. అతడి సినిమాలు అటు తమిళంతో పాటు ఇటు తెలుగులో కూడా సూపర్హిట్ అవుతూనే ఉన్నాయి. అలాంటి సూర్య.. ఇప్పుడు ప్రిన్స్ మహేష్బాబుకు సవాలు విసిరాడు. ఒకేసారి సూర్య, మహేష్ల సినిమాలు విడుదలవుతున్నాయేమో అనుకున్నారా? ఒక్క నిమిషం ఆగండి.

ఇటీవల ఐస్ బకెట్ ఛాలెంజ్ స్ఫూర్తితో రకరకాల సవాళ్లు వచ్చాయి. అందులో భాగంగానే 'మై ట్రీ ఛాలెంజ్' అని కూడా ఒకటి వచ్చింది. దేశంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు మొదలుపెట్టిన ఈ ఛాలెంజిని ప్రముఖ మళయాళ నటుడు మమ్ముట్టి స్వీకరించి, తాను సూర్య, విజయ్, షారుక్ ఖాన్లను నామినేట్ చేశాడు. ఈ ఛాలెంజిని స్వీకరించిన సూర్య.. తన తర్వాత ముగ్గురిని సవాలు చేశాడు. వాళ్లలో మహేష్ బాబు, సుదీప్, అమీర్ ఖాన్ ఉన్నారు. అంటే ఇప్పుడు ఈ ముగ్గురూ కూడా మై ట్రీ ఛాలెంజిని స్వీకరించాల్సి ఉంటుందన్నమాట.

Advertisement
Advertisement