త్వరలో సెట్స్ మీదకు సై..రా..! | Mega star Sye Raa Regular Shoot from October 5 | Sakshi
Sakshi News home page

త్వరలో సెట్స్ మీదకు సై..రా..!

Sep 5 2017 11:14 AM | Updated on Sep 17 2017 6:26 PM

త్వరలో సెట్స్ మీదకు సై..రా..!

త్వరలో సెట్స్ మీదకు సై..రా..!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ హిస్టారికల్ మూవీ సై రా నరసింహారెడ్డి.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ హిస్టారికల్ మూవీ సై రా నరసింహారెడ్డి. తొలి స్వతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాను చిరు తనయుడు రామ్ చరణ్ 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఇండియన్ సినిమాగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో పలువురు పరభాష నటులు నటించనున్నారు.

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం దేశంలోనే అత్యుత్తమ సాంకేతిక నిపుణులుగా గుర్తింపు తెచ్చుకున్న వారు  పనిచేస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ 5 నుంచి మొదలు కానుంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం రాజస్థాన్, పొల్లాచ్చి ప్రాంతాల్లో భారీ సెట్స్ నిర్మిస్తున్నారు. ఆ పనులు పూర్తయ్యాక షూటింగ్ మొదలు పెట్టాలని భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement