దాసరి నారాయణరావు కన్నుమూత | dasari narayana rao passes away at kims hospital | Sakshi
Sakshi News home page

దాసరి నారాయణరావు కన్నుమూత

May 30 2017 7:09 PM | Updated on Sep 5 2017 12:22 PM

ప్రముఖ దర్శక నిర్మాత దాసరి నారాయణరావు (75) కన్నుమూశారు.



ప్రముఖ దర్శక నిర్మాత దాసరి నారాయణరావు (75) కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వారం రోజుల క్రితం కిమ్స్ ఆస్పత్రిలో చేరిన ఆయన.. మంగళవారం సాయంత్రం తర్వాత మరణించినట్లు వైద్యులు తెలిపారు. అయితే వైద్యులు ప్రకటించడానికి ముందుగానే ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్‌ ఆస్పత్రి బయటకు వచ్చి, ''గురువు గారు ఇక లేరు, కాసేపట్లో బాడీని ఇంటికి తీసుకెళ్తున్నాం'' అని కన్నీటి పర్యంతమై చెప్పారు.

కళ్యాణ్ దాసరికి అత్యంత సన్నిహితంగా మెలిగే వ్యక్తి కావడంతో ఏం జరిగిందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమైంది. గతంలో ఒకసారి ఆపరేషన్ చేసిన తర్వాత వారం రోజుల క్రితం దాసరి నారాయణరావు మళ్లీ ఆస్పత్రిలో చేరారు. ఆయన అన్నవాహికకు రీకన్‌స్ట్రక్టివ్ సర్జరీ చేశామని, ఆ తర్వాత ఆయన మూత్రపిండాలలో సమస్య ఏర్పడిందని వైద్యులు తొలుత విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో ప్రకటించారు.

రాత్రి 7 గంటలకు...
రాత్రి 7 గంటలకు ఆయన గుండె పనిచేయడం మానేసిందని, దాన్ని పునరుద్ధరించేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్యపడలేదని కిమ్స్ వైద్యులు చెప్పారు. ఆయన మృతికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర వివరాలతో కూడిన బులెటిన్‌ను బుధవారం విడుదల చేయగలమని అన్నారు. ముందుగా ఆయన కుటుంబ సభ్యులకు వివరాలు తెలియజేస్తామని, ఆ తర్వాత మాత్రమే బయటకు విడుదల చేయగలమని తెలిపారు.

(ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement