
విడాకులివ్వండి: నటి ప్రేమ
బహుభాషా నటి ప్రేమ తన భర్త జీవన్ అప్పచ్చు నుంచి విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించింది.
= కోర్టును ఆశ్రయించిన బహుభాషా నటి ప్రేమ
బెంగళూరు(బనశంకరి) : బహుభాషా నటి ప్రేమ తన భర్త జీవన్ అప్పచ్చు నుంచి విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించింది. ఈమేరకు నగరంలోని ఫ్యామిలీ కోర్టులో బుధవారం పిటిషన్ దాఖలు చేశారు. కొడగు జిల్లాకు చెందిన ప్రేమ 2006లో కొడగు ప్రాంతానికి చెందిన జీవన్‌అప్పచ్చును వివాహమాడారు. 1995లో శివరాజ్‌కుమార్ నటించిన సవ్యసాచి అనే చిత్రం ద్వారా ప్రేమ కన్నడచిత్రరంగంలోకి అడుగుపెట్టారు. ఉపేంద్ర దర్శకత్వంలో నిర్మితమైన ఓం సినిమాలో మాధురి అనే పాత్రలో నటించి ప్రశంసలందుకున్నారు. తెలుగు, తమిళ భాష సినిమాల్లో కూడా ప్రేమ నటించారు.