3 గంటల వ్యవధిలో 13 సార్లు భూకంపం! | Sakshi
Sakshi News home page

3 గంటల వ్యవధిలో 13 సార్లు భూకంపం!

Published Sat, Apr 25 2015 3:38 PM

ఖట్మండులో కూలీన భవనం

ఖాట్మండు: నేపాల్లో మూడు గంటల వ్యవధిలో భూమి 13సార్లు కంపించింది. నేపాల్ రికార్డుల ప్రకారం రిక్టర్ స్కేలుపై 7.9గా నమోదు కాగా, చైనా రికార్డుల ప్రకారం 8.1గా నమోదైంది. నేపాల్లో సంభవించిన భారీ భూకంపం కారణంగా ఇప్పటివరకు 110 మంది మృతి చెందారు. అనేక భవనాలు కూలిపోయాయి. చారిత్రక కట్టడాలు కుప్పకూలాయి.

ఇదిలా ఉండగా మౌంట్ ఎవరెస్ట్పైన భారత సైనికులకు తృటిలో ప్రమాదం తప్పింది. భారత సైనిక బృందం దాటిన కొద్దిసేపటికే మంచుపెళ్లలు విరిగిపడ్డాయి. ఎవరెస్ట్పై సైనికులు అందరూ సురక్షితంగా ఉన్నట్లు ఇండియన్ ఆర్మీ ప్రకటిచింది.
ఖాట్మండులో భారీ భూకంపం కారణంగా దెబ్బతిన్న రోడ్డు

Advertisement
Advertisement