
'టీడీపీని.. పక్కదేశం పార్టీగా మార్చుకోండి'
పరాయి దేశం నుంచి పాలిస్తున్నట్లు ఉందన్న చంద్రబాబు నాయుడు తన పార్టీ పేరును మార్చుకోవాలని తెలంగాణ ఐటీశాఖ మంత్రి కె. తారకరామారావు సూచించారు.
హైదరాబాద్ : పరాయి దేశం నుంచి పాలిస్తున్నట్లు ఉందన్న చంద్రబాబు నాయుడు తన పార్టీ పేరును మార్చుకోవాలని తెలంగాణ ఐటీశాఖ మంత్రి కె. తారకరామారావు సూచించారు. తెలుగుదేశం పార్టీ పేరును 'పక్కదేశం పార్టీ'గా మార్చుకోవాలని అన్నారు. ఓవైపు ఖజానాలో డబ్బులు లేవంటూనే మరోవైపు రూ.15 కోట్లతో తన ఛాంబర్ను మరమ్మతు చేయించుకుంటున్నారని కేటీఆర్ విమర్శించారు. చంద్రబాబు వరంగల్ పర్యటనకు ముందే తెలంగాణకు న్యాయంగా రావాల్సిన కరెంట్, నీటి వాటాలపై వివరణ ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.