దేవరకొండ టీడీపీ అభ్యర్థి కుమార్తె ఆచూకీ లభ్యం | Belya naik daughter Harika traced out by the Hydrabad city police | Sakshi
Sakshi News home page

దేవరకొండ టీడీపీ అభ్యర్థి కుమార్తె ఆచూకీ లభ్యం

Apr 26 2014 8:39 AM | Updated on Oct 16 2018 8:50 PM

దేవరకొండ టీడీపీ అభ్యర్థి కుమార్తె ఆచూకీ లభ్యం - Sakshi

దేవరకొండ టీడీపీ అభ్యర్థి కుమార్తె ఆచూకీ లభ్యం

మూడు రోజుల క్రితం అదృశ్యమైన దేవరకొండ టీడీపీ అభ్యర్థి బిల్యానాయక్ కుమార్తె హారికా క్షేమంగా ఉన్నట్లు నగరంలోని మీర్పేట్ పోలీసులు శనివారం వెల్లడించారు.

మూడు రోజుల క్రితం అదృశ్యమైన దేవరకొండ టీడీపీ అభ్యర్థి బిల్యానాయక్ కుమార్తె హారికా క్షేమంగా ఉన్నట్లు నగరంలోని మీర్పేట్ పోలీసులు శనివారం వెల్లడించారు. అదృశ్యానికి గల కారణాలపై ఆమెను విచారిస్తున్నట్లు తెలిపారు. అనంతరం హారికను ఆమె తల్లితండ్రులకు అప్పగిస్తామన్నారు. ఇప్పటికే హారిక క్షేమంగా ఉన్నట్లు ఆమె తండ్రి బిల్యానాయక్కు సమాచారం అందించారమన్నారు. 

 

నల్గొండ జిల్లా టీడీపీ అధ్యక్షుడు, దేవరకొండ ఎమ్మెల్యే అభ్యర్థి కేతావత్ బిల్యానాయక్ కుమార్తె మూడు రోజుల క్రితం అదృశ్యమైంది. దాంతో ఆయన తన కుమార్తె ఆచూకీ తెలపాలంటూ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి... హారిక ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement