పాపపై పైశాచికం | Sakshi
Sakshi News home page

పాపపై పైశాచికం

Published Mon, Feb 29 2016 3:55 AM

పాపపై పైశాచికం - Sakshi

♦ కామాంధుడి చేతిలో బలైన బాలిక
♦ అత్యాచారం.. ఆపై గొంతునులిమి హత్య
♦ మృతదేహాన్ని కోళ్ల గంప కింద దాచి పరారీ
 
 కాటారం: కరీంనగర్ జిల్లాలో మరోచోట కామాంధులు బరితెగించారు. వీణవంక మండ లం చల్లూరుకు చెందిన ఓ దళిత యువతిపై సామూహిక అత్యాచారం... ఓదెల మండలం మడకలో ఆర్మీ జవాన్ యువతిపై అత్యాచారం చేసిన ఘటన లు మరువకముందే కాటారం మండలంలో మరో ఘోరం జరిగింది. ముక్కుపచ్చలారని ఓ పసిబాలికపై అఘాయిత్యం చేసి.. ఆపై గొంతు నులిమి చంపేసిందో మానవమృగం.

కాటారం మండలం దామెరకుంటకు చెందిన తొగరి త్రివేణి-రాయస్వామి దంపతులకు కూతుళ్లు సింధుశ్రీ, వినయశ్రీ(4), కుమారుడు మారుతి ఉన్నారు. శనివారం సాయంత్రం వినయశ్రీ రోజులాగా ఇంటి వద్ద ఆడుకుం టోంది. ఇంటివెనుకాలే నివాసముంటున్న జక్కు వెంకటస్వామి(35) చిన్నారిని చాక్లెట్ కొనిస్తానని చెప్పి తన ఇంట్లోకి తీసుకెళ్లాడు. పాపపై అత్యాచారానికి పాల్పడి, గొంతునులిమి చంపేశాడు. ఇంట్లోని కోళ్లగంప కింద మృతదేహాన్ని దాచేసి ఇంటికి తాళం వేసి పారి పోయాడు. వినయశ్రీ ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పలుచోట్ల గాలించారు. ఆదివా రం ఉదయం అనుమానంతో వెంకటస్వామి ఇంటితాళం పగలగొట్టి చూడగా  విషయం వెలుగు చూసింది.  నిందితుడి ఆచూకీ కోసం ప్రత్యేక గాలింపు బృందాలను ఏర్పాటు చేసినట్లు సీఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, కోపోద్రిక్తులైన గ్రామస్తులు, బాధిత కుటుంబసభ్యులు, వారి బంధువులు నిందితుడి ఇంటిపై దాడికి యత్నించారు. దహనం చేయడానికి పూనుకున్నారు. పోలీసులు పెద్ద ఎత్తున  వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.

 ఆది నుంచి అదే నేరచరిత్రే..
 నిందితుడు జక్కు వెంకటస్వామిది ఆది నుంచి నేరచరిత్రే. కొన్నేళ్ల క్రితం పీపుల్స్‌వార్ మిలిటెం ట్‌గా పనిచేసి కేసులపాలైనట్లు సమాచారం. గ్రామంలో జరిగిన ఓ హత్యాయత్నం కేసులో జైలుకు వెళ్లి శిక్ష అనుభవించి వచ్చాడు. అరుునా అతడిలో మార్పు లేదు. ఓ చోరీ కేసులో నింది తుడని తెలుస్తోంది. ఇతడి తీరుతో మొదటి భార్య విడాకులిచ్చి వెళ్లింది. మరో మహిళతో కొన్నాళ్లుగా సహజీవనం కొనసాగించాడని తెలిసింది. అతడి తీరుతో విసుగుచెందిన ఆమెకూడా వెళ్లిపోరుుంది. దీంతో అప్పటినుంచి సైకోగా ప్రవర్తిస్తున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. వెంకటస్వామి తాగొచ్చి నిత్యం చిత్రిహ ంసలు పెడుతుండడంతో తండ్రి మరో కొడుకు వద్దకు వెళ్లిపోయూడు. అతడి వ్యవహారశైలితో కుటుంబసభ్యులు కూడా దూరమయ్యూరు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement