చెల్లిని పువ్వుల్లో పెట్టి చూసుకునే అన్నయ్య... ఆ చెల్లి కోసం ఎంత దుర్మార్గానికైనా తెగించే అన్నయ్యగా ‘చంటి’ సినిమాలో కనిపించినా, ప్రత్యర్థి కోసం ఆకలాకలిగా ఎదురుచూసే ప్రతినాయకుడిగా ‘దమ్ము’లో కనిపించినా, బిజ్జలదేవునిగా శకుని తరహా విలనిజంతో ‘బాహుబలి’లో భయపెట్టినా... తనదైన విలనిజాన్ని చాటుకుంటున్నారు నాజర్.
‘‘నేను సినిమాల్లోకి వెళ్లాలనుకుంటున్నాను’’ అనగానే...
‘‘హాయిగా ఉద్యోగం చేసుకోకుండా సినిమాలేమిటి?’’ అనే తల్లిదండ్రులనే చూస్తుంటాం.
నాజర్ విషయంలో మాత్రం సీన్ రివర్స్.కడుపులో చల్ల కదలకుండా, డబ్బులకు ఇబ్బంది పడకుండా ఉండే ఉద్యోగం చేయాలనేది నాజర్ కల. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగం చేయడం ద్వారా తన కలను నెరవేర్చుకున్నాడు నాజర్. అయితే నాజర్ ఉద్యోగం చేయడం తండ్రికి నచ్చలేదు. కొడుకును నటుడిగా చూడాలనేది ఆయన కల. అయితే నాజర్‌కు మాత్రం ఎప్పుడూ నటన మీద ఆసక్తి లేదు.
అప్పుడెప్పుడో చిన్నప్పుడు పండగల సందర్భాల్లో నాటకాల్లో నటించడం తప్ప... నటన గురించి నాజర్‌కు పెద్దగా తెలియదు. దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన తనకు ఒక స్థిరమైన ఉద్యోగం అవసరం అనుకున్నారు నాజర్. అందుకే ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగంలో చేరినప్పుడు చాలా సంతోష పడ్డారు. కానీ నాన్న ఆలోచన వేరుగా ఉంది. ‘‘నీ గురించి ఎన్నో కలలు కంటే ఇలా చేస్తావా!’’ అన్నారు ఆయన బాధ పడిపోతూ. ఇక చేసేదేమి లేక ఉద్యోగానికి రాజీనామా చేశారు నాజర్. ‘‘సినిమాల్లో వేషాల కోసం ప్రయత్నిస్తాను’’ అన్నారు తండ్రితో.
‘‘అలా ఎలా కుదురుతుంది. శిక్షణ తీసుకోకుండా సినిమాల్లో ఎలా నటిస్తావు? నువ్వు నటనలో తప్పకుండా శిక్షణ తీసుకోవాల్సిందే’’ అని కాస్త గట్టిగానే చెప్పారు తండ్రి. అప్పుడుగానీ అర్థం కాలేదు. తన తండ్రి తన విషయంలో ఎంత పట్టుదలగా ఉన్నాడో. ఎలాగైనా సరే, తండ్రి కలను నిజం చేయాలనుకున్నారు. అడయార్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరారు. కె.బాలచందర్ ‘కళ్యాణ అగతిగల్’ సినిమాలో తొలి అవకాశం వచ్చింది. అయితే ఆ సినిమా ఫ్లాప్ కావడం కాస్త నిరాశకు గురైనా అంతలోనే తేరుకున్నారు.
‘కళ్యాణ అగతిగల్’ సినిమా ఫెయిల్యూర్ నాజర్ కెరీర్‌కు అడ్డంకేమీ కాలేదు. ఈ సినిమా తరువాత విలనీ ఛాయలు ఉన్న పాత్రలు చేసి శబ్భాష్ అనిపించుకున్నారు. మణిరత్నం సినిమా ‘నాయకన్’తో నాజర్‌కు మంచి బ్రేక్ వచ్చింది. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా నటించారు. ‘విలన్ లేనిది హీరో లేడు’ అని చెప్పే నాజర్ ఎన్నో సినిమాల్లో విలన్ క్యారెక్టర్లు చేసి ‘ఉత్తమ విలన్’ అనిపించుకున్నారు.
నేనొక్కసారి స్కెచ్ వేస్తే...
Published Sun, Jun 11 2017 6:09 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్‌పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
త్రినయని సీరియల్ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్ (ఫోటోలు)
స్టార్ హీరో గొప్పమనసు.. రూ. కోటి చెక్ విరాళం!
ఎరక్కపోయి ఇరుక్కుపోయి
మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
కేఎల్ రాహుల్ మాస్టర్ ప్లాన్.. మెక్ గర్క్ సిల్వర్ డక్! వీడియో
Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్‌గా మళ్లీ కోహ్లినే!
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
స్వాతి మలివాల్‌పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
'ఆ రూలే ఐపీఎల్‌ను మార్చేసింది.. వారు పునరాలోచనలో పడ్డారు'
తప్పక చదవండి
- తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్‌పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్‌కుమార్ ఆగ్రహం
Advertisement