ట్రెండీ.. థండీ.. | Sakshi
Sakshi News home page

ట్రెండీ.. థండీ..

Published Mon, Mar 30 2015 11:50 PM

ట్రెండీ.. థండీ..

మండేవేసవిలో వడదెబ్బ నుంచి తట్టుకోవాలంటే.. మజ్జిగో.. పళ్లరసాలో.. కొబ్బరి నీళ్లో తాగుతాం. అదే సూరీడి సురసుర చూపుల నుంచి ఒంటిని కాపాడుకోవాలంటే అందుకు తగ్గట్టుగా డ్రెస్సింగ్ చేసుకోవడం కంపల్సరీ. మగువల విషయానికి వస్తే ఆ వస్త్రాలు ట్రెడిషనల్ వేర్‌గా ఉంటూనే.. నయా ఫ్యాషన్‌ను ప్రతిబింబించేలా ఉండాలి.  ట్రెండ్‌ను ఫాలో అవుతున్న వనితల కోసం.. వేసవితాపాన్ని తట్టుకునే స్పెషల్ కాస్ట్యూమ్స్ తెస్తున్నారు ఫ్యాషన్ డిజైనర్లు. మార్కెట్‌లో హల్‌చల్ చేస్తున్న ఈ సమ్మర్ స్పెషల్స్‌ను వనితాలోకం సాదరంగా ఆహ్వానిస్తోంది.
 
వేసవిలో రాసిల్క్, పట్టు, జార్జెట్ వంటి కాస్ట్యూమ్స్ చికాకు తెప్పిస్తాయి. మేనును హత్తుకుని చెమట చిందిస్తాయి. అందుకే సమ్మర్ రాగానే నారీమణులంతా కాటన్ కాస్ట్యూమ్స్‌లోకి షిఫ్ట్ అయిపోతారు. కాటన్‌తో పాటు సాఫ్ట్ స్పన్, జ్యూట్, ఖాది, లినెన్ మెటీరియల్స్ మోస్ట్ కంఫర్ట్‌గా సెట్ అవుతాయి. ఫ్యాషన్ మంత్రం పఠిస్తున్న ప్రజెంట్ జెనరేషన్ కాటన్ దుస్తుల్లోనే.. కంఫర్ట్‌తో పాటు కలర్‌ఫుల్‌గా కనిపించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తోందని చెబుతున్నారు పీఆర్ ప్రీత్ డిజైనర్ స్టూడియో డిజైనర్లు ప్రియ, రూప.
 
కూల్.. కూల్..
కోట, తస్సేర్ కాటన్, క లంకారి, ఇకత్ ఇలా అనేక రకాల కంఫర్ట్ కాటన్ ప్యాబ్రిక్స్‌ని ఎక్కువ శాతం వాడుతూ న్యూ డిజైన్స్ క్రియేట్ చేస్తున్నారు ఫ్యాషన్ డిజైనర్లు. పైగా ఈ డ్రెస్‌లపైకి పచ్చని చెట్లను, అందాల సీతకోకచిలుకలను, రకరకాల పక్షులను, జంతువుల బొమ్మలను డిజైన్లుగా చేర్చి అదనపు సొబగులు అద్దుతున్నారు.

కాటన్ ఫ్యామిలీకి చెందిన ఈ ట్రెడిషనల్ వేర్ ఫుల్‌లెన్త్‌గా ఉండటం వల్ల స్పెషల్ లుక్ వస్తుందని చెబుతున్నారు ఫ్యాషన్ డిజైనర్లు. ఈ డ్రెస్సింగ్‌లో హైహీల్స్ వేసుకుని, హెయిర్ ఓపెన్‌గా ఉండేలా చూసుకుంటే.. కూల్‌గా కనిపించడమే కాదు.. మీరు కూడా కూల్‌గా ఉంటారు. కాజ్యువల్ వేర్‌గానే కాదు..
 ఫంక్షన్స్ వేర్‌గా కూడా ఇవి మీకు రిచ్ లుక్ ఇస్తాయి.    
 సిరి

Advertisement
Advertisement