అతిథి గృహం సందర్శించిన భువనేశ్వరి | cm chandrababu naidu wife bhuvaneswari visits lingamaneni guest house | Sakshi
Sakshi News home page

అతిథి గృహం సందర్శించిన భువనేశ్వరి

Aug 13 2015 10:35 AM | Updated on Jul 28 2018 2:46 PM

అతిథి గృహం సందర్శించిన భువనేశ్వరి - Sakshi

అతిథి గృహం సందర్శించిన భువనేశ్వరి

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోసం సిద్ధం అవుతున్న లింగమనేని అతిథి గృహాన్ని ఆయన సతీమణి భువనేశ్వరి నిన్న సందర్శించారు.

తాడేపల్లి: గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోసం సిద్ధం అవుతున్న లింగమనేని అతిథి గృహాన్ని ఆయన సతీమణి భువనేశ్వరి నిన్న సందర్శించారు.  బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు అక్కడకు వచ్చిన ఆమె మధ్యాహ్నం ఒంటిగంట వరకూ అక్కడే ఉండి అన్ని గదులను పరిశీలించారు. భువనేశ్వరి పర్యటన రహస్యంగా జరగడంతో స్థానిక అధికారులకు, నాయకులకు ఈ సమాచారం తెలియలేదు.

కాగా  తాడేపల్లి మండల పరిధిలోని ఉండవల్లి కరకట్టపై ఏర్పాటు చేసుకోనున్న అధికారిక నివాసం వద్ద పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అత్యంత గోప్యంగా  ఈ పనులు జరుగుతున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement