మరోసారి కీలక నిర్ణయం తీసుకున్న ఆర్బీఐ | Sakshi
Sakshi News home page

మరోసారి కీలక నిర్ణయం తీసుకున్న ఆర్బీఐ

Published Wed, Mar 4 2015 9:15 AM

మరోసారి కీలక నిర్ణయం తీసుకున్న ఆర్బీఐ

ముంబయి: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. రెపో రేటును 0.25 శాతాన్ని తగ్గించింది. ఆర్బీఐ రెండు నెలల వ్యవధిలో రెండుసార్లు రెపోరేటును తగ్గించటం విశేషం. అయితే నగదు నిల్వలను యథాతధంగా ఉంచింది.  ఆర్బీఐ నిర్ణయంతో బ్యాంకుల నుంచి గృహ, వాహన, వ్యక్తిగత రుణాలు తీసుకున్న ఖాతాదారులకు శుభవార్తే. తగ్గించిన రెపోరేటు తక్షణమే అమల్లోకి రానుంది. దాంతో 7.5గా ఉన్న రెపోరేటు 7.25కి చేరింది . రోజు రోజుకు క్షీణిస్తున్న వృద్ధిరేటుతో పాటు పెట్టుబడులను ఆకర్షించేందుకు రిజర్వుబ్యాంకు ఆఫ్‌ ఇండియా  రెపో రేటును 0.25 శాతం తగ్గించింది.

Advertisement
 
Advertisement