సాయంత్రం టీడీపీ కాపు నేతల ప్రత్యేక భేటీ | tdp kapu leaders to special meet in today evening | Sakshi
Sakshi News home page

సాయంత్రం టీడీపీ కాపు నేతల ప్రత్యేక భేటీ

Jun 10 2016 12:58 PM | Updated on Aug 10 2018 9:42 PM

కాపులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ముద్రగడ పద్మానాభంకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీడీపీలోని కాపు నేతలను సిద్ధం చేస్తున్నారు.

విజయవాడ: కాపులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ముద్రగడ పద్మనాభంకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీడీపీలోని కాపు నేతలను సిద్ధం చేస్తున్నారు. ఈ సందర్భంగా టీడీపీలోని కాపు నేతలు శుక్రవారం సాయంత్రం ప్రత్యేకంగా సమావేశం జరగనుంది.

మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, నారాయణ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు, ఇతర నేతలు  భేటీ కానున్నారు.  ఈ సమావేశంలో కాపు రిజర్వేషన్లు, నిధులపై చర్చించనున్నట్లు సమాచారం. అలాగే ముద్రగడపై రాజకీయ విమర్శలు చేసి, ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేయాలన్న చంద్రబాబు ఆదేశాలతో టీడీపీ నేతలు పావులు కదుపుతున్నారు. ముద్రగడ పద్మనాభం, కాపుల మధ్య చీలిక తెచ్చేలా ప్రణాళిక అమలు చేసేందుకు సిద్ధం అవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement