సిట్ను తన ఆధీనంలోకి తీసుకున్న హైకోర్టు | Sakshi
Sakshi News home page

సిట్ను తన ఆధీనంలోకి తీసుకున్న హైకోర్టు

Published Tue, Apr 28 2015 11:45 AM

సిట్ను తన ఆధీనంలోకి తీసుకున్న హైకోర్టు - Sakshi

హైదరాబాద్ : తిరుపతి శేషాచలం ఎన్కౌంటర్ ఘటనపై హైకోర్టు మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఎన్కౌంటర్పై ప్రభుత్వం నియమించిన సిట్ను న్యాయస్థానం తన ఆధీనంలోకి తీసుకుంది. 60 రోజుల్లోగా దర్యాప్తు పూర్తి చేయాలని హైకోర్టు ఈ సందర్భంగా సిట్ను ఆదేశించింది. సిట్ సభ్యులపై అభ్యంతరాలు ఉంటే ప్రమాణ పత్రాలు దాఖలు చేయాలని ఆదేశించింది.

శేషాచలం ఎన్కౌంటర్ కేసు డైరీని న్యాయస్థానం స్వాధీనం చేసుకుంది. అలాగే పోలీసులు దాఖలు చేసిన కేసు డైరీపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కాగా ఏప్రిల్ 9న చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ లో తమిళనాడుకు చెందిన 20 మంది కూలీలు మృతిచెందిన సంగతి తెలిసిందే.

ఐజీ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో సిట్ను ఏపీ సర్కార్ ఏర్పాటు చేసిన విషయం విదితమే.ప ఇందులో 8 మంది పోలీసు అధికారులు ఉన్నారు. సిట్ సభ్యులుగా కర్నూలు రేంజి డీఐజీ రమణకుమార్, ఎస్పీ పాలరాజు, పశ్చిమగోదావరి జిల్లా ఏఎస్పీ చంద్రశేఖర్, సీఐడీ డీఎస్పీ యుగంధర్ బాబు, కే రఘు, కోరుకొండ సీఐ మధుసూదన్, చిత్తూరు సీఐ చంద్రశేఖర్ ఉన్నారు.

Advertisement
Advertisement