రాజధానికి భూములు ఇచ్చేది లేదని గుంటూరు జిల్లాలోని పలు గ్రామాలకు చెందిన రైతులు కరాకండీగా చెబుతున్నారు.
గుంటూరు: రాజధానికి భూములు ఇచ్చేది లేదని గుంటూరు జిల్లాలోని పలుగ్రామాలకు చెందిన రైతులు కరాకండీగా చెబుతున్నారు. తమ భూముల జోలికి వస్తే ఊరుకోబోమని హెచ్చరిస్తున్నారు. ల్యాండ్ పూలింగ్ వ్యతిరేకంగా మంగళగిరి మండలం నిడమర్రులో మంగళవారం రైతులు ఆందోళనకు దిగారు.
కావాలంటే తామందరం రూ.లక్ష చొప్పున ప్రభుత్వానికి డబ్బు ఎదురిస్తామని, తమ భూముల జోలికి రావొద్దంటూ అధికారులపై అన్నదాతలు మండిపడ్డారు. బలవంతంగా భూములు లాక్కుంటే పురుగుల మందు తాగి చస్తామని రైతులు హెచ్చరించారు. అప్పటివరకు రైతులపై చిందులు తొక్కిన గంటూరు ఆర్డీవో భాస్కరనాయుడు అన్నదాతల ఆందోళనతో అక్కడి నుంచి జారుకున్నారు.