అట్లకర్ర తెచ్చిన తంటా: బాలికకు గాయాలు | Sakshi
Sakshi News home page

అట్లకర్ర తెచ్చిన తంటా: బాలికకు గాయాలు

Published Sat, Aug 29 2015 5:03 PM

girl injures in east godavari district

కారప (తూర్పుగోదావరి): అట్లకర్రతో ఆడుకుంటున్న చిన్నారి ప్రమాదవశాత్తూ దాన్ని మెడలో కుచ్చుకుంది. అట్లకర్ర పదునుగా ఉన్న వైపు బాలిక మెడలో దాదాపు 10 సెంటిమీటర్ల లోతులో దిగింది. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా కారప మండలం చొల్లంగి గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన కట్టదేవి నాగ సౌజన్య (9) అట్లకర్రతో ఆడుకుంటూ మెడలో కుచ్చుకుంది. గాయపడ్డ ఆ చిన్నారిని తల్లిదండ్రులు కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా.. శస్త్ర చికిత్స చేసి బయటకు తీయనున్నట్లు వైద్యులు తెలిపారు.

Advertisement
Advertisement