ఆసుపత్రిలోనే లెక్చరర్ను విచారిస్తున్న పోలీసులు | Sakshi
Sakshi News home page

ఆసుపత్రిలోనే లెక్చరర్ను విచారిస్తున్న పోలీసులు

Published Fri, Oct 31 2014 10:59 AM

ఆసుపత్రిలోనే లెక్చరర్ను విచారిస్తున్న పోలీసులు - Sakshi

ఏలూరు: చీటింగ్ కేసులో కటకటాలపాలైన సీఆర్ రెడ్డి కళాశాల లెక్చరర్ గౌస్ మొయిద్దీన్ను ఎట్టకేలకు జిల్లా పోలీసులు శుక్రవారం కస్టడీలోకి తీసుకున్నారు. వైద్యులు, లాయర్ల సమక్షంలో గౌస్ను పోలీసులు విచారిస్తున్నారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రిలోని స్పెషల్ రూంలో గౌస్ను పోలీసులు విచారిస్తున్నారు. తనకు తీవ్ర అనారోగ్యంగా ఉదంటూ గురువారం అటు పోలీసులను, ఇటు వైద్యులను ముప్ప తిప్పలు పెట్టిన గౌస్ను శుక్రవారం ఉదయం పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు.


గౌస్ మొయిద్దీన్ స్థానిక సీఆర్ రెడ్డి కళాశాలలో పోలిటికల్ లెక్చరర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఆ క్రమంలో ఆయన పోలీసు ఉన్నతాధికారులో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నాడు. అయితే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ వారి వద్ద నుంచి భారీ ఎత్తున్న నగదు తీసుకునే వాడు. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో కూడా పలు మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఉద్యోగం ఇప్పించకుండా నగదు అడిగితే బెదిరించడంతో పలువురు నిరుద్యోగులు పోలీసులను ఆశ్రయించార. ఈ నేపథ్యంలో అక్టోబర్ 23న పోలీసులు గౌస్ నివాసంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా పలు విలువైన డాక్యుమెంట్లుతోపాటు నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
Advertisement