దిగిరాని కూరగాయలు | Sakshi
Sakshi News home page

దిగిరాని కూరగాయలు

Published Sun, Dec 21 2014 6:12 AM

దిగిరాని కూరగాయలు - Sakshi

జ్ఞానాపురం : శీతాకాలం ముదిరినా న్యూ హోల్‌సేల్ మార్కెట్‌లో కూరగాయ ధరలు మాత్రం ఇంకా దిగిరాలేదు. గత వారంతో పోలిస్తే మాత్రం శనివారం స్వల్పంగా తగ్గాయి. అన్ని రకాల కూరగాయలు రూ.20కి పైబడి విక్రయిస్తుండడంతో వినియోగదారులు అర్థ కిలోలతో సరిపెడుతున్నారు.

మార్కెట్లో కాలీఫ్లవర్ మాత్రమే కిలో రూ.10లకు విక్రయిస్తుండడంతో వినియోగదారులు వీటినే ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. దిగుమతులు తక్కువగా ఉండడంతో ధరలు దిగిరాలేదని వ్యాపారులు చెబుతున్నారు.

జ్ఞానాపురం హోల్‌సేల్ మార్కెట్ అందించిన వివరాలతో నగరంలో శనివారం పలు రైతుబజార్లలో కూరగాయ ధరలు ఇలా ఉన్నాయి. హోల్‌సేల్ మార్కెట్‌కు  ప్రతి ఆదివారం సెలవు. కాబట్టి ఈ ధరలు సోమవారం ఉదయం 8 గంటల వరకు అమలులో ఉంటాయి.

Advertisement
Advertisement