Breaking News

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం, ముగ్గురు దుర్మరణం

Published on Sun, 09/28/2025 - 10:58

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. నార్త్ కరోలినాలో ఒక రెస్టారెంట్ వద్ద ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. బోటులో వచ్చి జనంపై విరుచుకుపడ్డాడు. విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.   ఈఘటనకు సంబంధించిన వీడియోలు నెట్టింట  వైరల్‌గా మారాయి.

విల్మింగ్టన్‌కు సమీపంలోని సౌత్‌పోర్ట్ యాట్ బేసిన్ ప్రాంతంలో ఉన్న ‘అమెరికన్ ఫిష్ కంపెనీ’ అనే రెస్టారెంట్‌లో శనివారం రాత్రి 9:30 గంటల సమయంలో ఈ  దారుణం చోటుచేసుకుంది. రెస్టారెంట్ సమీపంలో బోటులు వచ్చిన  వ్యక్తి ఒక్కసారిగా  తుపాకీతో జనంపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఏడుగురికి బుల్లెట్‌ గాయాలయ్యాయి. ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అనంతరం అదే బోటులో పరారయ్యాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కాల్పుల ఘటనను సిటీ మేనేజర్ నోవా సాల్డో ధ్రువీకరించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితులను స్థానిక ఆసుపత్రులకు తరలించారు. అయితే మృతుల వివరాలను, గాయపడిన పరిస్థితుల గురించి  వివరాలను అధికారులు ఇంకా  విడుదల చేయలేదు. 

స్థానికులు సంఘటనా ప్రాంతానికి దూరంగా ఉండాలని, సౌత్‌పోర్ట్ ప్రాంతానికి ఎవరూ రావొద్దని, ఇంటి లోపలే ఉండాలని మరియు ఏదైనా అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే 911కు నివేదించాలని పోలిసులు కోరారు. బ్రున్స్విక్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం, సౌత్‌పోర్ట్ పోలీస డిపార్ట్‌మెంట్‌కు సహాయం అందిస్తోంది. నిందితుడి కోసం గాలింపు ముమ్మరం  చేశాయి.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)