Breaking News

ఎన్నికలకు పోలీసులు సిద్ధం

Published on Tue, 10/17/2023 - 08:31

వరంగల్‌: వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారని సీపీ అంబర్‌ కిషోర్‌ ఝా అన్నారు. సోమవారం రాత్రి కమిషనరేట్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎన్నికల నిర్వహణపై ఆయన మాట్లాడారు. ఇప్పటికే కమిషనరేట్‌ పరిధిలో రూ.1.23 కోట్ల విలువైన విదేశీ, దేశీయ మద్యం, బెల్లం, గంజాయిని సీజ్‌ చేసినట్లు తెలిపారు.

ఎన్నికల నిబంధనల ప్రకారం.. నిషేధితాలను, అనుమానం ఉన్న అన్నింటినీ సీజ్‌ చేస్తామని పేర్కొన్నారు. ప్రజలు రూ.50 వేలకు మించి వెంట ఉంచుకోరాదని, నగదును దగ్గర ఉంచుకుంటే దానికి సంబంధించి తగిన ఆధారాలు కలిగి ఉండాలని లేదంటే డబ్బులను ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు సీజ్‌ చేస్తారని తెలిపారు.    

10 డైనమిక్‌ చెక్‌పోస్ట్‌లు..
ఎన్నికల సందర్భంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌పై ప్రత్యేక దృష్టి సారించి కమిషనరేట్‌ పరిధిలో 10 డైనమిక్‌ చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేసినట్లు సీపీ తెలిపారు. ఈ చెక్‌పోస్ట్‌లు ప్రతిరోజూ ఒక చోటి నుంచి మరో చోటికి మారుతాయని, దీని వల్ల మద్యం డబ్బులతో పాటు ఇతర వస్తువులు సరఫరా చేసే వ్యక్తులను సులభంగా పట్టుకోవచ్చని పేర్కొన్నారు.

ఎన్నికల్లో ఓటర్లను మభ్యపెట్టేలా వివిధ పార్టీల నేతలు నిబంధనలకు విరుద్ధంగా పంపిణీ చేస్తే ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు సీజ్‌ చేస్తాయన్నారు. ఎన్నికల నిర్వహణ బందోబస్తు కోసం వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌కు ప్రత్యేకంగా 6 పారామిలటరీ కంపెనీలు వస్తున్నాయని పేర్కొన్నారు.

వాహనాలకు జీపీఎస్‌, కెమెరాలు
డబ్బు, మద్యం, ఇతరత్రా నజరానాలతో ఓటర్లను ప్రభావితం చేయకుండా నియంత్రించడానికి ఏడు ప్రభుత్వ శాఖల అధికారులతో కలిసి ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈబృందాల్లో పోలీస్‌ అధికారి నోడల్‌ ఆఫీసర్‌గా ఉంటారని పేర్కొన్నారు.

పోలీసు వాహనాలకు జీపీఎస్‌ అనుసంధానం చేయడంతో పాటు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ వాహనాలకు కెమెరాలు కూడా అనుసంధానం చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఫిర్యాదులు, సమాచారాన్ని 1950 నంబర్‌ ద్వారా తెలియజేయాలని కోరారు. తుపాకీ లైసెన్స్‌ కలిగిన వ్యక్తులు వాటిని పోలీస్‌స్టేషన్‌లో డిపాజిట్‌ చేసేలా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.

మావోయిస్టులపై నిఘా..
ప్రస్తుతం వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో మావోయిస్టుల ప్రాబల్యం లేనప్పటికీ నిఘా మాత్రం కొనసాగుతోందని సీపీ అంబర్‌ కిషోర్‌ ఝా తెలిపారు. ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి పథకాలు అందాయని, గతంతో పోలిస్తే ప్రస్తుతం మావోయిస్టుల ఉనికి లేదని పేర్కొన్నారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా పోలీస్‌ నిఘా కొనసాగుతుందని పేర్కొన్నారు.
 

Videos

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)