Breaking News

నేటితో ముగియనున్న వైకుంఠ ద్వార దర్శనం

Published on Mon, 01/01/2024 - 10:46

తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబరు 23న ప్రారంభమైన వైకుంఠద్వార దర్శనం సోమవారం రాత్రి ఏకాంతసేవతో శాస్త్రోక్తంగా ముగియనుంది. నిన్న 64,665 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 20,845 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారికి కానుకల రూపంలో హుండీ ద్వారా రూ.4.34 కోట్లు  ఆదాయం వచ్చింది. 

 తిరుమలకు రోజురోజుకూ భక్తుల తాకిడి పెరుగుతోంది. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం హుండీకి కాసుల వర్షం కురుస్తోంది. దక్షిణాది రాష్ట్రాల నుంచే కాకుండా దేశం మొత్తం నుంచి భక్తులు విచ్చేసి స్వామి వారిని దర్శించుకుంటున్నారు. ఇక శ్రీవారికి వచ్చే ఆదాయం కూడా భారీగా పెరుగుతోంది.

రోజుకు సగటున శ్రీవారి హుండీ ఆదాయం రూ.3 కోట్లు దాటుతోంది. ఈ క్రమంలోనే 2023 ఏడాదిలో తిరుమల వేంకటేశ్వరుడికి వచ్చిన మొత్తం హుండీ ఆదాయం వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. 2023 సంవత్సరంలో శ్రీవారికి హుండి ద్వారా 1402 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.

తిరుమల శ్రీవారికి భారీగా నగదు, ఇతర విలువైన కానుకలను భక్తులు సమర్పిస్తున్నారు. గత ఏడాది కాలం నుంచి స్వామివారి హుండీ ఆదాయం ప్రతీ నెల రూ.100 కోట్లకు పైగానే సమకూరుతూ వస్తోందని టీటీడీ అధికారులు తెలిపారు. 2023 ఏడాదిలో ప్రతీ నెలా హుండీ ఆదాయం రూ.100 కోట్ల మార్క్‌ను దాటినట్లు అధికారులు తెలిపారు.

నూతన సంవత్సరం నాడు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్న పలువురు ప్రముఖులు
► శారదాపీఠం ఉత్తరధికారి సాత్మానంద సరస్వతి
► తెలంగాణ గవర్నర్ తమిళ్ సై సౌందర రాజన్
► జమ్మూ కాశ్మీర్ గవర్నర్ మనోజ్ సిన్హా
► సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి
► డిప్యూటీ స్పీకర్ కొలగట్ల వీరభద్రస్వామి
► మినిస్టర్ గుమ్మనూరు జయరాం
► ఏపీ లోక్ యుక్తజడ్జ్ జస్టీస్ లక్ష్మణ్ రెడ్డి
► మినిస్టర్ మెరుగు నాగార్జున
► తమిళనాడు మినిస్టర్ గాంధీ
► హీరో సుమన్
► తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క
► ఎంపీ మోపిదేవి వెంకటరమణ

Videos

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)