యూట్యూబర్‌ ప్రణీత్‌ హనుమంతు అరెస్ట్‌

Published on Wed, 07/10/2024 - 16:46

సాక్షి, హైదరాబాద్‌: తండ్రీ కూతుళ్ల బంధంపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్‌ ప్రణీత్‌ హనుమంతు అరెస్ట్‌ అయ్యారు. బుధవారం బెంగళూరులో అతన్ని అరెస్ట్‌ చేసిన పోలీసులు హైదరాబాద్‌కు తీసుకురానున్నారు. ఇప్పటికే అతనిపై సైబర్‌ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు.

కొన్నేళ్లుగా తన స్నేహితులతో వీడియో చాటింగ్‌ చేస్తూ అసభ్యకర మాటలతో రెచ్చిపోతున్న ప్రణీత్‌ హనుమంతు తీరుపై టాలీవుడ్‌ హీరో సాయి దుర్గ తేజ్‌ మొదటిసారి రియాక్ట్‌ అయ్యాడు. ఆయన తీరును తప్పుబడుతూ ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులకు సోషల్‌ మీడియా ద్వారా విషయాన్ని షేర్‌ చేశారు. దీంతో ఈ విషయం నెట్టింట వైరల్‌ అయింది.

తండ్రీకూతుళ్ల బంధంపై విచక్షణ మరచి ప్రణీత్‌ హనుమంతు మాట్లాడాడు.  తండ్రి, కుమార్తె బంధంలో అశ్లీలం ధ్వనించేలా తన స్నేహితులతో ఆయన మాట్లాడాడు. సాయి దుర్గ తేజ్‌ ఈ విషయాన్ని తెరపైకి తీసుకురావడంతో  తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చర్యలకు ఆదేశించారు. 

తాజాగా ప్రణీత్‌ హనుమంతును  టీజీ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో అధికారులు బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. అక్కడే ఆయన్ను కోర్టులో హాజరుపరిచారు. ట్రాన్సిట్‌ వారెంట్‌ ద్వారా ప్రణీత్‌ హనుమంతును హైదరాబాద్‌కు తీసుకురానున్నారు. ఆయనపై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ కేసు నమోదు చేశారు. ప్రణీత్‌తో పాటు అతని స్నేహితులలో మరో ముగ్గుర్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

యూట్యూబర్‌ ప్రణీత్‌ హనుమంతు అరెస్ట్‌

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)