తండ్రికి బైక్‌ను బహుమతిగా ఇవ్వాలని బయలుదేరి..

Published on Sun, 04/27/2025 - 07:00

మునగాల(సూర్యాపేట జిల్లా): సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద విజయవాడ – హైదరాబాద్‌ జాతీయ రహదారిపై శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన యువతి మృతిచెందింది. భీమవరం మండలం తుందుర్రు గ్రామానికి చెందిన చేడె జనార్దన్‌ కుమార్తె యశస్విని (24) మూడేళ్లుగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా విధులు నిర్వర్తిస్తోంది.

తన తండ్రికి బహుమతిగా ఇవ్వాలనుకుని యశస్విని బుల్లెట్‌ వాహనాన్ని కొనుగోలు చేసి శుక్రవారం రాత్రి తన సహ ఉద్యోగి బడ్డుకొండ అచ్యుత్‌కుమార్‌తో కలిసి అదే బుల్లెట్‌పై తమ స్వగ్రామమైన తుందుర్రుకు బయలుదేరింది. బుల్లెట్‌ బైక్‌ను అచ్యుత్‌కుమార్‌ నడుపుతున్నాడు. ఈ క్రమంలో ఆకుపాముల శివారులోకి రాగానే హైవేపై పడిఉన్న గేదె కళేబరాన్ని ఢీకొట్టారు. దీంతో యశస్విని బుల్లెట్‌పై నుంచి ఎగిరి రోడ్డుపై పడింది. అదే సమయంలో హైదరాబాద్‌ నుంచి విజయవాడ వైపు వెళ్లే లారీ అతివేగంతో వచ్చి రహదారిపై పడిఉన్న యశస్విని మీదుగా వెళ్లింది. 

దీంతో యశస్విని తల, మెడభాగం ఛిద్రమై అక్కడికక్కడే మృతిచెందింది. అచ్యుత్‌కుమార్‌ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న మునగాల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని యశస్విని మృతదేహాన్ని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మృతురాలి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. శనివారం మృతురాలి కుటుంబ సభ్యులు మునగాలకు చేరుకున్నారు. మృతురాలి బాబాయ్‌ చేడె సురేష్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. యశస్విని మృతదేహాన్ని ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు.    

 

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)