Breaking News

రోడ్డు ప్రమాదంలో యువతి దుర్మరణం

Published on Thu, 02/13/2025 - 07:10

మూసాపేట: చిన్ననాటి స్నేహితునితో కలిసి స్కూటీపై వెళ్తున్న యువతిని రెడీమిక్స్‌ లారీ ఢీకొనడంతో దుర్మరణం పాలైంది. కూకట్‌పల్లి పోలీసులు, స్థానికులు తెలిపిన మేరకు.. శ్రీకాకుళం జిల్లా, పాతపట్నం గ్రామానికి చెందిన కుమారి తన కుమార్తె మమత, కుమారుడితో కలిసి మూసాపేటలోని ముష్కిపేటలో ఉంటోంది. 

కుమారి కూతురు మమత(17) మంగళవారం రాత్రి తన స్నేహితురాలి ఇంటికి వెళ్తున్నానని చెప్పి వెళ్లింది. రాత్రి 11 గంటల సమయంలో మమత తన చిన్ననాటి స్నేహితుడైన నరేశ్‌తో కలిసి మూసాపేట నుంచి కూకట్‌పల్లి వైపు స్కూటీపై వెళ్తుండగా మూసాపేట మెట్రో స్టేషన్‌ పిల్లర్‌ 878 వద్ద గుర్తు తెలియని రెడీమిక్స్‌ లారీ ఢీ కొట్టింది. దీంతో ఇద్దరూ కింద పడిపోగా రెడీమిక్స్‌ వాహనం మమత నడుం మీదనుంచి వెళ్లడంతో తీవ్రంగా గాయపడింది. వెంటనే ఇద్దర్నీ స్థానిక ఆస్పత్రికి తరలించగా మమత మృతిచెందినట్లు వైద్యులు వెల్లడించారు. 

తల్లి ఫిర్యాదు మేరకు కూకట్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసి..మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాగా ఢీకొట్టిన రెడీమిక్స్‌ లారీ వివరాలు తెలియవని, సీసీ ఫుటేజీలు పరిశీలించాక వివరాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా..మమత మృతిపై తమకు అనుమానాలు ఉన్నాయని మృతురాలి బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)