Breaking News

డబ్బులు తీసుకుని ఇవ్వడం లేదని..

Published on Sun, 02/02/2025 - 10:05

జీడిమెట్ల: డబ్బులు తీసుకున్న వ్యక్తి తిరిగి ఇవ్వకపోవడం , ఈ  విషయమై ఇంట్లో గొడవలు జరుగుతుండటంతో మనస్తాపానికి లోనైన ఓ మహిళ ఉరివేసుకుని అత్మహత్యకు పాల్పడిన సంఘటన జీడిమెట్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ గడ్డం మల్లేష్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జీడిమెట్ల టీఎస్‌ఎస్‌ఐసీ కాలనీలో నివాసం ఉంటున్న చందు భార్య లావణ్య(35) స్థానికంగా టైలరింగ్‌ షాప్‌ నిర్వహిస్తోంది.

 కొద్ది నెలల క్రితం ఆమెకు శివరాం అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. లావణ్యతో స్నేహంగా ఉండే శివరాం తన వ్యాపార నిమిత్తం రూ.5లక్షలు అప్పుగా ఇవ్వాలని కోరాడు. దీంతో ఆమె తన  నగలు తాకట్టు పెట్టి రూ.5 లక్షలు ఇచ్చింది. నెలలు గడుస్తున్నా శివరాం డబ్బులు చెల్లించకపోవడంతో ఆమె ఈ విషయాన్ని తన భర్త దృష్టికి తీసుకెళ్లింది. దీంతో చందు శుక్రవారం శివరాంను ఇంటికి పిలిచి డబ్బుల విషయమై నిలదీయగా  ఇద్దరి మధ్య గొడవ జరిగింది.

 దీంతో లావణ్య శివరాంకు ఫోన్‌చేసి నువ్వు డబ్బులు ఇవ్వనందునే తమ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని నీ కారణంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పింది. దీంతో ఆందోళనకు గురైన శివరాం, చందు ఇంటికి వెళ్లి చూడగా లావణ్య చీరతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించింది. ఇద్దరూ కలిసి ఆమెను కిందికి దింపి సమీపంలోని అస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు జీడిమెట్ల  పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

Videos

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?