Breaking News

వేలు గోర్లు కత్తిరించి.. ఫ్యాషన్ డిజైనర్‌పై లైంగిక దాడి

Published on Thu, 10/30/2025 - 07:44

హైదరాబాద్: స్నేహితురాలిపై పైశాచికత్వం చూపించాడో యువకుడు. ఆమెపై లైంగిక దాడికి పాల్పడి.. మధ్య వేలు గోర్లు కత్తిరించి, కత్తెరతో ఆమెపై తీవ్రంగా దాడిచేశాడు. పోలీసులకు, ఇతరులు ఎవరికైనా చెబితే యాసిడ్‌ పోసి చంపేస్తానంటూ బెదిరించిన ఘటన పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరుకు చెందిన ఓ యువతి ఫ్యాషన్‌ డిజైనింగ్‌ చేసేందుకు నగరానికి వచ్చి ఆర్థిక ఇబ్బందులతో సగంలోనే కోర్సును ఆపేసింది. అనంతరం ల్యాంకోహిల్స్‌ వద్ద ఓ ప్రైవేట్‌ సంస్థలో టెక్నికల్‌ సపోర్ట్‌ ఎగ్జిక్యూటివ్‌గా విధులు నిర్వహిస్తూ సోమాజిగూడ, కపాడియా లైన్‌లో ఓ అపార్ట్‌మెంట్‌లో స్నేహితులతో కలిసి ఓ ఫ్లాట్‌లో నివసిస్తుంది. ఆమె పనిచేసే సంస్థలోనే విధులు నిర్వహించే బీఎన్‌ రెడ్డి నగర్‌ పరిధలోని చైతన్యనగర్‌కు చెందిన ఎ.భానుప్రకాష్‌తో పరిచయం అయింది. అతను వివాహం చేసుకుంటానని నమ్మించి సదరు యువతిని ప్రేమలోకి దింపాడు. 

ఈ క్రమంలో విభేదాలు మొదలై భానుప్రసాద్‌ బాధితురాలిని తరచూ వేధించడం, కొట్టడం, బెదిరించడం చేస్తుండే వాడని పోలీసులు తెలిపారు. ఈ నెల 26వ తేదీన రాత్రి 2:30కి బాధితురాలు ఉండే ఫ్లాట్‌కి వచ్చి ఆమె రూమ్‌ మేట్స్‌ను సైతం బెదిరించి..గదిలో బంధించి బలవంతంగా లైంగిక దాడి చేశాడు. అంతే కాకుండా కత్తెరతో దాడి చేశారు. దీంతో బాధితురాలు తీవ్ర భయాందోళనకు గురికాగా..మరుసటి రోజు స్నేహితులతో కలిసి పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు భానుప్రకాష్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.  
 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)