Breaking News

ప్రేమపేరుతో యువకుడి వేధింపులు.. తాళలేక యువతి ఆత్మహత్య

Published on Tue, 06/09/2026 - 09:10

జగిత్యాల క్రైం: ప్రేమపేరుతో ఓ యువకుడి వేధింపులు భరించలేక యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన జగిత్యాల రూరల్‌ మండలం అనంతారం గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. రూరల్‌ ఎస్సై ఉమాసాగర్‌ వివరాలు వెల్లడించారు. గ్రామానికి చెందిన సైదు శ్రీలత (20) జగిత్యాల పట్టణంలో ఇటీవలే డిగ్రీ పూర్తి చేసింది.

ఈ క్రమంలో మూడేళ్లుగా జగిత్యాల రూరల్‌ మండలం సంగంపల్లి గ్రామానికి చెందిన అంకతి రాజు ప్రేమ పేరుతో శ్రీలతను వేధిస్తు న్నాడు. తనకు ఇష్టం లేదని చెప్పినా వినకుండా వెంటపడుతుండటంతో శ్రీలత మూడేళ్ల కిందటే ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. కుటుంబసభ్యులు కాపాడారు.

అయినప్పటికీ యువకుడి వేధింపులు తీవ్రం కావడంతో కుటుంబ సభ్యులు అతడిని మందలించారు. అయినా మార్పు రాకపోగా.. సోమవారం శ్రీలతకు ఫోన్‌ చేసి తీవ్ర వేధింపులకు గురిచేయడంతో మనస్తాపానికి గురై ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి సత్తయ్య ఫిర్యాదు మేరకు రాజుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఉమాసాగర్‌ తెలిపారు.

Videos

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

నేను తాడిపత్రి పోతా.. ఏం పీకుతారో పీక్కోండి.. మాస్ వార్నింగ్

మరి గోరం... హీరోయిన్ ఎంగిలి చేసిన బాటిల్ ధర రూ.3 లక్షలు..!

అనంతపురం రూరల్ EX ZPTCపై పోలీసుల ఓవర్ యాక్షన్

జోగి రమేష్ హౌస్ అరెస్ట్

ఆ 15 స్థానాల్లో పోటీయే లేదు..! లైవ్ లో మొత్తం బయటపెట్టిన YS జగన్

Photos

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)

+5

సన్ ఫ్లవర్ తో రితికా నాయక్‌ (ఫొటోలు)