Breaking News

స్కూల్‌ ఫీజు చెల్లించలేదని ప్రిన్సిపాల్‌ మందలింపు..

Published on Thu, 02/13/2025 - 07:27

కార్పొరేట్‌ విద్యా సంస్థలు ధనార్జనే ధ్యేయంగా పని చేస్తూ ఫీజుల కోసం విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. అమాయకుల ప్రాణాలను బలిగొంటున్నాయి. కుటుంబ ఆర్థిక పరిస్థితి, విద్యార్థుల మానసిక స్థితి గురించి ఆలోచించకుండా ప్రవర్తిస్తున్నాయి. కొంచెం కూడా మానవత్వాన్ని చూపడం లేదు. దీంతో విద్యార్థులు తీవ్ర మానసిక క్షోభకు గురై చావు నోట్లో తలపెడుతున్నారు. 

స్కూల్‌ ఫీజు చెల్లించలేదని పాఠశాల ప్రిన్సిపాల్‌ తోటి విద్యార్థుల ముందే మందలించడంతో మనస్తాపానికి గురైన టెన్త్‌ విద్యార్థిని ఆత్మహత్యా యత్నానికి పాల్పడి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన మేడ్చల్‌ పట్టణంలో చోటు చేసుకుంది. కాగా..  ఇంటర్‌ విద్యార్థిని హాస్టల్‌ గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బాచుపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది.  

మేడ్చల్‌ రూరల్‌:  మేడ్చల్‌ పట్టణంలోని శ్రీ చైతన్య స్కూల్‌లో కమల, వెంకటేశ్వర్లు దంపతుల కవల పిల్లలు అఖిల, విక్రమ్‌లు 10వ తరగతి చదువుతున్నారు. వీరిరువురి ఫీజు రూ.30 వేలు చెల్లించాల్సి ఉంది. అందులో రూ.10 వేలు చెల్లించారు. మిగతా మొత్తం చెల్లించడంలో తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు. ఈ నెల 8న అఖిల పాఠశాలకు వెళ్లగా ప్రిన్సి పాల్‌ రమాదేవి తోటి విద్యార్థినుల ముందే అవమానకరంగా మాట్లాడింది. తెలిసిన వారితో ఫీజు కోసం తనను ప్రిన్సిపాల్‌ టార్చర్‌ చేస్తున్నారని చెప్పుకొని ఏడ్చింది. సోమవారం పాఠశాలకు వెళ్లలేదు. మంగళవారం తల్లి ఇంట్లో ఉండగానే అఖిల వేరే గదిలోకి వెళ్లి గడియ వేసుకుని ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. వెంటనే స్థానికుల సాయంతో ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.    

ఎస్‌ఎఫ్‌ఐ ఆందోళన 
పాఠశాల యాజమాన్యం తీరుతో విద్యార్థిని అఖిల ఆత్మహత్యకు పాల్పడిందని ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలు ఆందోళన దిగారు. పాఠశాల ముందు బైఠాయించి విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలని..  విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న పాఠశాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 

వేధింపులు నిజం కాదు..   
ఈ విషయమై పాఠశాల ప్రిన్సిపాల్‌ రమాదేవి, నిర్వాహకులు వివరణ ఇస్తూ తాము అఖిలను వేధించలేదని తెలిపారు. అందరితో పాటు తనకు ఫీజు చెల్లించాలని గుర్తు చేశామన్నారు. కాగా ఘటనకు కారణమైన పాఠశాల ప్రిన్సిపాల్‌పై మేడ్చల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

హాస్టల్‌ గదిలో ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్మ 
నిజాంపేట్‌ : ఇంటర్‌ విద్యార్థిని హాస్టల్‌ గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బాచుపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం సూర్యాపేట జిల్లా కృష్ణాపురంనకు చెందిన బైసు శ్రీనివాస్, దేవి దంపతులు నగరంలోని బోరబండ ఫేజ్‌– 3లో నివాసం ఉంటున్నారు. వీరి కూతురు పూజిత (17) బాచుపల్లిలోని ఎస్‌ఆర్‌ జూనియర్‌ కాలేజీలో ఇంటర్‌ చదువుతోంది. బుధవారం ఉదయం హాస్టల్‌ రూంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో కాలేజీ సిబ్బంది వెంటనే స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌కు తరలించారు.

 పూజిత అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగా.. మొదట కాలేజీ సిబ్బంది పూజిత బాత్రూంలో జారిపడిందని ఆమె తల్లిదండ్రులకు చెప్పారు. వారిని హాస్పిటల్‌కు రావాలని సూచించారు. కొద్ది సేపటి తర్వాత చనిపోయింది గాంధీ ఆసుపత్రికి రావాలని చెప్పడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. తమ కూతురు మృతి అనుమానాస్పదంగా ఉందని పూజిత తల్లిదండ్రులు ఆరోపించారు. కాలేజీ యాజమాన్యం ఒత్తిడితోనే విద్యార్థిని మృతి చెందిందని విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి.

 

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)