బైక్‌ రైడ్‌ .. రికార్డ్‌ బ్రేక్‌..

Published on Fri, 01/24/2025 - 09:17

సాక్షి, హైదరాబాద్‌: వేగవంతమైన రైడ్‌ చేసిన అతిపిన్న వయస్కుడైన బైకర్‌గా ఇటీవల ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ గుర్తింపు çఅందుకున్నాడు కొండా సిద్ధార్‌్థ. నగరవాసి అయిన మంచిర్యాలకు చెందిన సిద్ధార్థ్‌ ప్రస్తుతం సొంత వ్యాపారం చేస్తున్నాడు. ఈ సందర్భంగా తను పంచుకున్న విశేషాలు తన మాటల్లోనే.. 

జాలీరైడ్‌ చేద్దామనుకున్నా.. 
బైక్‌ మీద తోచినదారిన సాగిపోవాలని, మార్గ మధ్యంలోనే పని చేసుకుంటూ, సంపాదించుకుంటూ ఆ డబ్బునే ఖర్చు చేసుకుంటూ యాత్ర చేయాలనేది నా ఆలోచన. అయితే రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ మేనేజర్‌  విమలేష్‌ కుమార్‌ నాన్‌ రిపీటింగ్‌ రైడ్‌ గురించి నాకు తొలుత పరిచయం చేశాడు. తనే ఆ తర్వాత కూడా మార్గనిర్దేశం చేస్తూ  సహకరించారు. ఈ రైడ్స్‌ ద్వారా మంచి సందేశాలు అందించవచ్చని, అలాగే రికార్డ్స్‌ సాధించొచ్చని తెలుసుకున్నాక.. ఆ దిశగా నేనెందుకు ప్రయత్నం చేయకూడదు? అని ప్రశ్నించుకున్నా.. నా యాత్రకు అవయవ దానం, జంతువుల సంక్షేమంపై అవగాహన కల్పించడమే లక్ష్యం మార్చుకున్నా. కేవలం 96 రోజుల్లో 40,708.5 కిమీ ప్రయాణంలో 28 రాష్ట్రాలు 2,731 ప్రదేశాల మీదుగా సాగిపోయా. ఇందులో ఓ కేంద్ర పాలిత ప్రాంతం కూడా కవర్‌ అయ్యింది.  

ఈ రైడ్‌లో.. 3వ రికార్డ్‌.. 
ప్రపంచంలో ఈ తరహా నాన్‌ రిపీటింగ్‌ మారథాన్‌ ట్రిప్‌ ఫీట్‌ను సాధించిన ముగ్గురు పిన్న వయసు రైడర్‌లలో చైనా నుంచి ఒకరు, చెన్నై నుంచి మరొకరు మాత్రమే ఉన్నారు. అలా మన దేశం నుంచి నేను కూడా వారి సరసన ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో పేరును నమోదు చేసుకున్నా. ప్రస్తుతం గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో నమోదు చేయాలనుకుంటున్నా. లడఖ్‌లో రెండు వారాల పాటు మంచు కురుస్తున్న ప్రాంతంలో ట్రాఫిక్‌ నిలిచిపోయినప్పుడు ద్రాస్‌లో రోడ్డుకు అడ్డంగా మంచు చరియలు విరిగిపడుతున్నప్పుడు.. కఠిన పరిస్థితుల్ని ఎదుర్కొన్నా. అదృష్టవశాత్తూ ఈ డేంజరస్‌ ప్రయాణంలో ఎలాంటి ప్రమాదానికీ గురికాలేదు.  

ప్రమాదాల నివారణకు..
ఈ రైడ్‌ కోసం రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ హిమాలయన్‌ 411 అనే అడ్వెంచర్‌ బైక్‌ ఉపయోగించా. జర్మనీ నుంచి ప్రత్యేక హెల్మెట్‌ను దిగుమతి చేసుకున్నా. స్లీపింగ్‌ బ్యాగ్, కెమెరాతో పాటు రోడ్డు ప్రమాదాలను నివారించడానికి జంతువులకు కట్టడానికి కాలర్‌ టైలను తీసుకువెళ్లా, క్యాంపింగ్‌ టెంట్, మెడికల్‌ కిట్, మోటర్‌బైక్‌ ఉపకరణాలు దగ్గర ఉంచుకున్నా. యుఎస్‌ లోని ఓ ఇన్‌స్టిట్యూట్‌ నుంచి ఫైర్‌ సేఫ్టీ సంబంధిత కోర్సును అభ్యసించా.  

Videos

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)