Breaking News

సార్.. నా కొడుకు బతికున్నాడా.?

Published on Tue, 01/28/2025 - 07:24

రాంగోపాల్‌పేట్‌: హుస్సేన్‌ సాగర్‌లో ఆదివారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో ఒక యువకుడు అదృశ్యమయ్యాడు. భారతమాతకు మహా హారతి కార్యక్రమం సందర్భంగా హుస్సేన్‌సాగర్‌లో బోటు నుంచి బాణసంచా కాల్చడంతో అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో నలుగురు గాయపడగా, కుషాయిగూడ నాగారానికి చెందిన సిల్వేరు అజయ్‌ (21) అనే బీటెక్‌ విద్యార్థి రాత్రి నుంచి అదృశ్యం అయ్యారు. 

ఉదయం నుంచి ఆ యువకుడి కోసం లేక్‌ పోలీసులు, డీఆర్‌ఎఫ్‌ బృందాలు, గజ ఈతగాళ్లు గాలింపు చేపట్టినా ఆచూకీ మాత్రం దొరక లేదు. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన గణపతి అనే వ్యక్తి సికింద్రాబాద్‌ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈయన పరిస్థితి విషమంగా ఉండగా..ప్రణీత్‌కుమార్,  సునీల్‌ అదే ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. వీర వెంకట సత్యనారాయణ అనే వ్యక్తికి స్వల్ప గాయాలు కాగా డిశ్చార్జ్‌ చేశారు.  

స్నేహితుడితో కలిసి వచ్చిన... 
కుషాయిగూడ నాగారానికి చెందిన ఆటో డ్రైవర్‌ జానకిరాం, నాగలక్ష్మి దంపతుల కుమారుడు అజయ్‌ గీతాంజలి ఇంజనీరింగ్‌ కాలేజ్‌తో తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. అజయ్‌ స్నేహితుడు రాఘవేంద్రకు టపాకాయల వ్యాపారి మణికంఠ డబ్బులు ఇచ్చేది ఉంది. ఆదివారం సాయంత్రం మణికంఠకు రాఘవేంద్ర ఫోన్‌ చేయగా తాను ట్యాంక్‌బండ్‌ దగ్గర ఉన్నానని, ఇక్కడికి వస్తే డబ్బు ఇస్తానని చెప్పాడు. దీంతో మరో స్నేహితుడు సాయిసందీప్‌తో కలిసి ఆదివారం రాత్రి 7.30 గంటలకు ట్యాంక్‌ బండ్‌కు చేరుకున్నారు. ఆ తర్వాత మణికంఠకు ఫోన్‌ చేయగా బోటులో సాగర్‌ లోపల నుంచి ఒడ్డుకు వచ్చి వారికి డబ్బులు చెల్లించాడు.

 తాము బోటులో లోపలికి వస్తామని చెప్పడంతో అందరూ కలిసి బాణసంచా కాల్చే దగ్గరకు వెళ్లగా అదే సమయంలో అగి్నప్రమాదం చోటుచేసుకుంది. ఘటన సమయంలో బోటు సిబ్బందితో పాటు మరికొంత మంది బోటు సిబ్బంది అక్కడ ఉన్నారు. బాణసంచాను కచాప్‌లో ఉంచగా దానికి అనుసంధానంగా మెకనైజ్డ్‌ బోటు, మరో స్పీడ్‌ బోటు ఉన్నాయి. మెకనైజ్డ్‌ బోటుకు కూడా మంటలు అంటుకోవడంతో అందరూ అందులో నుంచి కిందకు నీళ్లలోకి దూకేశారు. అక్కడే ఉన్న బోటు సిబ్బంది నీళ్లలోకి దూకి కొందర్ని రక్షించగా..అజయ్‌ మాత్రం గల్లంతయ్యారు. అజయ్‌తో పాటు వచి్చన రాఘవేంద్ర, సాయి సందీప్‌లకు ఈత రావడంతో కొద్ది దూరం ఈదుకుంటూ రాగా అక్కడికి వచి్చన స్పీడ్‌ బోట్‌ సిబ్బంది వారిని రక్షించి బయటకు తీసుకు వచ్చారు.  

తెల్లవారు జామున గుర్తించిన స్నేహితులు 
గాయపడిన వారిని మొదట పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించగా అక్కడ తెల్లవారు జామున 2 గంటలకు రాఘవేంద్ర, సాయిసందీప్‌లు కలుసుకుని అజయ్‌ గురించి ఆరాతీశారు. అయితే అప్పుడు అజయ్‌కి ఫోన్‌ చేయగా స్విచ్‌ఆఫ్‌ ఉంది. అదే విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియచేశారు.  

కుటుంబ సభ్యుల ఆందోళన..  
విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు తెల్లవారు జామున హుస్సేన్‌ సాగర్‌ వద్దకు చేరుకుని అజయ్‌ కోసం ఆరా తీశారు. తమ కుమారుడు కనిపించక పోవడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా రోదించారు. కాగా అజయ్‌ కోసం లేక్‌ పోలీసులు, డీఆర్‌ఎఫ్‌లకు చెందిన 5 బృందాలు సోమవారం ఉదయం నుంచి హుస్సేన్‌ సాగర్‌లో గాలింపు చేపట్టాయి. ఉదయం నుంచి బోట్లు, గజ ఈత గాళ్ల సహాయంతో సాగర్‌ మొత్తం సాయంత్రం 6.30 గంటల వరకు గాలించినా యవకుడి ఆచూకీ మాత్రం కనిపించ లేదు. మంగళవారం మరో మారు గాలింపు చేపడతామని పోలీసులు తెలిపారు. ప్రమాద ఘటనపై లేక్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా..సోమవారం అజయ్‌ కుటుంబ సభ్యులు ఇచి్చన ఫిర్యాదు మేరకు మిస్సింగ్‌ కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ హన్మంతు తెలిపారు.  

లేటుగా వస్తానని చెప్పి.. 
రాత్రి 8.30కి ఫోన్‌ చేస్తే ట్యాంక్‌బండ్‌పై ఉన్నా..కొద్దిగా లేటుగా వస్తాను అని చివరి మాటలు చెప్పాడంటూ అజయ్‌ తల్లి నాగలక్ష్మి, తండ్రి జానకిరాం కన్నీరుమున్నీరుగా రోదించారు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)