Breaking News

‘నేను ఇపుడు ఎవరికి అన్నం తినిపించాలి బిడ్డా’

Published on Tue, 01/27/2026 - 13:43

‘అమ్మ.. ఇప్పుడే వస్తా .. నేను ఇంటికి వచ్చిన తర్వాత అన్నం తింటా’ అని చె ప్పిన ఒక్కగానొక్క కొడుకు రోడ్డుప్రమాదంలో మృతిచెందడంతో.. ‘నేను ఇపుడు ఎవరికి అన్నం తి నిపించాలి బిడ్డా’ అని అతడి తల్లి రోదించిన తీరు కంటతడి పెట్టించింది. మరో యువకుడి తల్లిదండ్రులు సైతం చేతికందిన కొడుకు ఇక లేడని గుండెలవిసేలా రోదించారు.

కరీంనగర్‌క్రైం/వీణవంక: కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని హౌజింగ్‌బోర్డుకాలనీలో సోమవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు స్నేహితులు మృతిచెందగా, వారి తల్లిదండ్రుల రోదనలు మి న్నంటాయి. త్రీటౌన్‌ పోలీసులు తెలిపిన వివరాలు.. వీణవంక మండలం మామిడాలపల్లి గ్రా మానికి చెందిన మ్యాకల గణేశ్‌(22), అదే గ్రామానికి చెందిన మిరియాల సందీప్‌రెడ్డి(20)తో పాటు మరో స్నేహితుడు వేర్వేరు బైక్‌లపై గణేశ్‌ బైక్‌ స్పేర్‌ పార్ట్స్‌ కోసం మధ్యాహ్నం కరీంనగర్‌ వచ్చారు. అనంతరం గణేశ్‌, సందీప్‌రెడ్డి బైక్‌పై ఇంటికి వెళ్తున్నారు. ఈక్రమంలో హౌసింగ్‌బోర్డుకాలనీలో రోడ్డు క్రాస్‌ చేస్తున్న ప్రైవేట్‌ సూ్‌క్‌ల్‌ బస్సును ఢీకొని బైక్‌పై నుంచి ఎగిరిపడ్డారు. ఇద్దరికి తీవ్రగాయాలు కాగా స్థానికులు 108లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స ప్రారంభించే క్రమంలో ఇద్దరూ మృతిచెందారు. మృతుడు గణేశ్‌ తల్లి పద్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ జి.తిరుమల్‌ తెలిపారు.

మామిడాలపల్లిలో విషాదం

కరీంనగర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందడంతో స్వగ్రామం వీణవంకలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన మ్యాకల కొమురయ్య–పద్మ దంపతులకు గణేశ్‌తో పాటు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. గణేశ్‌ ఇంటర్‌లోనే చదువు మానేసి ఇంటి వద్దే వ్యవసాయ పనులు చూసుకుంటున్నాడు. మిరియాల శ్రీనివాస్‌రెడ్డి–మమత దంపతులకు ఒక్కగానొక్క కొడుకు సందీప్‌రెడ్డి. ఇంటర్‌ వరకు చదివి ఇంటి వద్దే ఉంటున్నాడు. తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కొడుకు ఒక్కడే కావడంతో అల్లారుముద్దుగా పెంచారు. చేతికొచ్చిన కొడుకులు మృతిచెందడంతో ఆ కుటుంబాల్లో రోదనలు మిన్నంటాయి.

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)