Breaking News

క్రికెట్‌ ఆడుతూ గుండెపోటుతో యువకుడు మృతి

Published on Sun, 04/20/2025 - 16:29

సాక్షి, మేడ్చల్ జిల్లా: కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. రాంపల్లి దాయరలో క్రికెట్ ఆడుతూ క్రికెట్ గ్రౌండ్‌లోనే ఓ యువకుడు గుండెపోటుతో మృతి చెందాడు. క్రికెట్‌ ఆడుతూ గ్రౌండ్‌లోనే కుప్పకూలిపోయాడు. మృతుడిని ఓల్డ్ బోయినపల్లి చెందిన ప్రణీత్(32)గా గుర్తించారు. మృతుడి కుటుంబంలో విషాదం నెలకొంది.

గత వారం రోజుల క్రితం కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా వెంకట్రావుపేట గ్రామానికి చెందిన ప్రశాంత్‌ అనే యువకుడు గుండెపోటుతో మృతి చెందాడు. కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న ప్రశాంత్‌కు శనివారం ఫిట్స్‌ రావడంతో అంబులెన్స్‌లో సిరిసిల్లలోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతున్న ప్రశాంత్‌ గుండెపోటుకు గురై మృతిచెందాడు.

ఇటీవలే కొన్నిరోజుల క్రితం...గుజరాత్‌లో ఓ ఎనిమిదేళ్ల బాలిక తరగతి గది కారిడార్‌లో ఒక్కసారిగా గుండెపోటు రావడంతో విగతజీవిలా కిందకు వాలిపోవడం స్కూల్‌ సీసీటీవీలో రికార్డయింది. కాగా, ఈ మధ్యకాలంలో గుండెపోటుతో హఠాత్‌ మరణాలు పెరిగిపోతున్నాయి. చిన్నా–పెద్దా, పురుషులు–మహిళలు, ధనవంతుడు–పేదవాడు అనే తారతమ్యాలు, వయసు తేడాలు లేకుండా ఏడెనిమిదేళ్ల లోపు చిన్న పిల్లలు మొదలు 18–25 ఏళ్ల మధ్య యువజనులు, శారీరకంగా ధృడంగా ఉండే రాజకీయవేత్తలు, కసరత్తులు చేసి ఫిట్‌గా ఉండే క్రీడాకారులు, అప్పటిదాకా ఎలాంటి గుండెజబ్బు ఆనవాళ్లు లేనివారు కూడా అకస్మాత్తుగా వచ్చే హార్ట్‌ ఎటాక్, కార్డియక్‌ ఫెయిల్యూర్లతో నేలకొరుగుతున్నారు.

 

 

Videos

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)