Breaking News

తెల్లారితే భార్య ప్రసవం.. పిడుగు పాటుతో భర్త మృతి 

Published on Mon, 04/21/2025 - 12:16

ఎమ్మిగనూరురూరల్‌(కర్నూలు): తెల్లారితే తన రక్తాన్ని పంచుకుని పుట్టే శిశువును ఆ యువకుడు చూడాల్సి ఉంది. అయితే విధి పగపట్టింది. పసికందును చూడకుండానే పిడుగు రూపంలో మృత్యు ఒడికి చేర్చింది. ఈ దుర్ఘటన ఆదివారం రాత్రి ఎమ్మిగనూరు మండలం గుడేకల్‌ కొండపై చోటుచేసుకుంది. పెద్దకడుబూరు మండలం హనుమాపురం గ్రామానికి చెందిన గొల్ల ఈరన్న(25) ఎమ్మిగనూరు యాక్సిస్‌ బ్యాంక్‌లో బంగారు నగలపై తీసుకున్న రుణాలు రికవరీ చేసే ఉద్యోగం చేస్తున్నాడు. ఈ యువకుడు అదే గ్రామానికి చెందిన గొల్ల సరస్వతిని పెళ్లి చేసుకున్నాడు. సరస్వతి నేడు (సోమవారం) ప్రసవం అవుతుందని వైద్యులు చెప్పారు.

 గొల్ల ఈరన్న తల్లి లక్ష్మీకి అనారోగ్యంగా ఉండటంతో గుడేకల్‌ కొండపై ఉండే సుంకాలమ్మకు మొ క్కు తీర్చుకుంటే తగ్గుతుందని పెద్దలు చెప్పారు. దీంతో ఆదివారం సాయంత్రం గొల్ల ఈరన్న,  అతని స్నేహితులు, బంధువులైన సహదేవుడు, ఈరన్న, రామాంజనేయులు కలసి కొండపై శ్రీ సుంకాలమ్మ గుడి దగ్గరకు వెళ్లారు. మొక్కుబడి తీర్చుకొని అక్కడే వంట చేసుకొని భోజనం చేశారు. ఆకస్మాత్తుగా ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులు రావడంతో చెట్టు కిందకు నలుగురు వెళ్లారు. చెట్టు కింద కూర్చున్న గొల్ల ఈరన్నపై పిడుగు పడటంతో అక్కడికక్కడే స్పృహతప్పి పడిపోయాడు. 

పక్కనే ఉన్న సహదేవుడు, ఈరన్న, రామాంజనేయులకు స్వల్ప గాయాలయ్యాయి. గ్రామంలో ఉన్న బంధువులకు సమాచారం అందించటంతో అక్కడికి వచ్చి గొల్ల ఈరన్నతో పాటు మరో ముగ్గురిని చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే గొల్ల ఈరన్న(25) మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తన భార్య సరస్వతికి సోమవారం ప్రసవం ఉందని బంధువుల దగ్గర గొల్ల ఈరన్న చెప్పారు. భార్య ఒకరికి ప్రాణం పోసేలోపే భర్త ప్రాణం పిడుగు రూపంలో తీసుకుపోవటంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. రూరల్‌ ఏఎస్‌ఐ రామేశ్వరావు, కానిస్టేబుల్‌ బి.గోపాల్‌ ప్రభుత్వాసుపత్రికి వచ్చి ప్రమాదం జరిగిన తీరును మృతుడి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎమ్మిగనూరు రూరల్‌ ఎస్‌ఐ శ్రీనివాసులు చెప్పారు.

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)