Breaking News

ఉదయం అదృశ్యం.. రాత్రికి మృతదేహం

Published on Thu, 10/05/2023 - 07:34

హైదరాబాద్: జీవితంపై విరక్తి చెంది ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఫిలింనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన  నన్నపనేని కార్తీక్‌ (28) నగరంలోని ఓ టీవీ చానెల్‌లో కెమెరామన్‌గా పని చేస్తున్నాడు. ఫిలింనగర్‌లోని భగత్‌సింగ్‌ కాలనీలో మహిపాల్, భీమా ప్రవీణ్‌తో కలిసి అద్దె గదిలో ఉంటున్నాడు. ఈ నెల 2న ఉదయం కార్తీక్‌ ఉద్యోగానికి వెళ్తున్నట్లు స్నేహితులకు చెప్పి తన బైక్‌పై బయలుదేరాడు. 

రాత్రి తిరిగి రాకపోయేసరికి రూమ్మేట్‌ ప్రవీణ్‌ ఫోన్‌ చేయగా స్విచ్ఛాఫ్‌ అని రావడంతో రాత్రంతా వెతికారు. ఈ నెల 3న కూడా గదికి రాకపోయేసరికి ఫిలింనగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో కార్తీక్‌ కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకొని గాలిస్తున్న సమయంలో మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట్‌ చెరువులో పడి కార్తీక్‌ ఆత్మహత్య చేసుకున్నట్లుగా సమాచారం అందింది. మంగళవారం సాయంత్రం శామీర్‌పేట్‌ చెరువు వద్ద బైక్‌తో పాటు కార్తీక్‌ మొబైల్‌ ఫోన్‌ పోలీసులకు కనిపించింది. 

దీని ఆధారంగా కార్తీక్‌ అడ్రస్‌ను కనిపెట్టి ఫిలింనగర్‌ పోలీసులకు సమాచారం అందించారు. బుధవారం తెల్లవారుజామున కార్తీక్‌ మృతదేహం ఒడ్డుకురావడంతో అదే విషయాన్ని ఫిలింనగర్‌ పోలీసులకు తెలియజేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కార్తీక్‌ ఆత్మహత్యకు కారణాలపై   పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. 

ముఖ్య గమని​క:
ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)