Breaking News

HYD: లిఫ్టు ప్రమాదం విషాదాంతం.. బాలుడు అర్ణవ్‌ మృతి

Published on Sat, 02/22/2025 - 10:33

సాక్షి, నాంపల్లి: ప్రమాదవశాత్తు అపార్ట్‌మెంట్‌ లిఫ్టులో ఇరుక్కుపోయిన అర్ణవ్‌(6) తాజాగా మృతిచెందాడు. నిలోఫర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అర్ణవ్‌ మృతిచెందినట్టు శనివారం మధ్యాహ్నం వైద్యులు తెలిపారు. వెంటిలేటర్‌పై చికిత​ అందించినప్పటికీ బాలుడిని కాపాడుకోలేకపోయారు. అయితే, లిఫ్టు ప్రమాదంలో పొత్తి కడుపు నలిగిపోయినట్టు వైద్యులు వెల్లడించారు. అలాగే, ఇంటర్నల్‌ బ్లీడింగ్‌ అయినట్టు వైద్యులు చెప్పారు. దీంతో, బాలుడు చనిపోయినట్టు స్పష్టం చేశారు.  

ప్రమాదం ఇలా జరిగింది..
నాంపల్లి పోలిస్‌స్టేషన్‌ పరిధిలోని ఆగాపుర గోడేకిఖబర్‌ ప్రాంతానికి చెందిన అజయ్‌కుమార్‌ ప్రైవేట్‌ హెల్త్‌ మేనేజర్‌గా పని చేస్తున్నారు. ఆయన కుమారుడు అర్ణవ్‌(6).. శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో తన తాతతో కలిసి రెడ్‌హిల్స్‌ శాంతినగర్‌ పార్కు ఎదురుగా ఉన్న మఫర్‌ కంఫర్ట్‌ అపార్ట్‌మెంట్‌ మూడో అంతస్తులో నివసిస్తున్న మేనత్త వద్దకు వెళ్లాడు. తాతా, మనవడు లగేజీతో లిఫ్టు ముందు నిలబడ్డారు. కిందికి వచ్చిన లిఫ్టు లోపలికి మొదట బాలుడు వెళ్లాడు. బాలుడి తాత కొంత లగేజీని లిఫ్టులో పెట్టాడు. మిగిలిన లగేజీని తెచ్చేందుకు అతడు మళ్లీ లిఫ్టు బయటికి వెళ్లాడు.

అంతలోనే అర్ణవ్‌ బటన్‌ నొక్కాడు. అంతే.. క్షణాల్లో లిఫ్టు కదిలి పైకి వెళ్లింది. లిఫ్టు గ్రిల్స్‌ తెరిచే ఉండటంతో బయపడ్డ బాలుడు లిఫ్టు నుంచి దూకాడు. ఈ క్రమంలో లిఫ్టుకు, స్లాబ్‌ గోడకు మధ్యలోని సందులో ఇరుక్కుపోయాడు. అప్పటికే లిఫ్టు.. మొదటి ఫ్లోర్‌ స్లాబ్‌ వద్దకు చేరుకుని నిలిచిపోయింది. అందులో ఇరుక్కున్న అర్ణవ్‌ గట్టిగా అరిచాడు. అపార్ట్‌మెంట్‌లోని వారంతా అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. నాంపల్లి  ఇన్‌స్పెక్టర్‌ అప్పలనాయుడు ఫైర్‌ సిబ్బందికి, హైడ్రా డీఆర్‌ఎఫ్‌ బలగాలను రప్పించారు.

రెండు గంటల పోరాటం..
మొదట గ్యాస్‌కటర్‌తో లిఫ్టు గ్రిల్స్‌ను తొలగించే ప్రయత్నం చేసినా.. బాలుడి క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని చివరికి లిఫ్టు గోడలను బద్దలుకొట్టారు. దాదాపు రెండు గంటల పాటు శ్రమించి అతికష్టమ్మీద బాలుడిని బయటికి తీశారు. నడుము, కడుపు భాగానికి తీవ్ర గాయాలై.. అపస్మారకస్థితికి చేరిన బాలుడికి 108 వైద్య బృందం ఆక్సిజన్‌ అందించి.. అనంతరం నిలోఫర్‌ ఆసుపత్రికి తరలించింది. బాలుడికి  ప్రస్తుతం ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోందని, పరిస్థితి విషమంగానే ఉందని  నిలోఫర్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రవికుమార్‌ తెలిపారు.

లిఫ్టు పని తీరుపై అనుమానాలు..  
శాంతినగర్‌ కాలనీలోని మఫర్‌ కంఫర్టెక్‌ అపార్ట్‌మెంట్‌ మొత్తం నాలుగు అంతస్తులు ఉంది. ఈ అపార్ట్‌మెంట్‌ను మఫర్‌ అనే సంస్థ నిర్మించి  గ్రిల్స్‌తో కూడిన లిఫ్టును ఏర్పాటు చేసింది. ఎక్కడైనా గ్రిల్స్‌ మూస్తేనే లిప్ట్‌ పైకి కదులుతుంది. కానీ ఇక్కడి లిఫ్టు గ్రిల్స్‌ వేయకుండానే, కేవలం బటన్‌ నొక్కగానే పైకి కదిలింది. ఇలా లిఫ్టు పని చేయడంతోనే బాలుడు ఇరుక్కుపోవడానికి కారణమైందని భావిస్తున్నారు.    

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)