Breaking News

‘సిక్‌’ లీవ్‌ అని చెప్పేద్దామా?

Published on Sun, 10/19/2025 - 04:55

సాక్షి, హైదరాబాద్‌: భారతీయుల్లో వర్క్‌–లైఫ్‌ బ్యాలెన్స్‌ సమస్యలు అధికంగా బయటపడుతున్నాయి. దాదాపు 75 శాతం మంది వృత్తి నిపుణులు మానసిక ఆరోగ్యం సరిచేసుకునే విషయంలో వెనుకబడుతున్నారు. ఇటీవల నిర్వహించిన నౌక్రీ పల్స్‌ 2025 సర్వేలో పాల్గొన్నవారిలో నలుగురు ఇండియన్లలో ముగ్గురు సెలవుకు మానసిక ఆరోగ్య కారణాలను వెల్లడించడానికి ఇష్టపడటం లేదని తేలింది. పనిలో మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అంశాల్లో... పేలవమైన పని–జీవిత సమతుల్యతలో 39%తో భారత్‌ వృత్తి నిపుణులు ముందువరసల్లో నిలుస్తున్నారు. 

దాదాపు 80 పరిశ్రమలలో 19,650 మంది వృత్తి నిపుణులపై ఈ సంస్థ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ సర్వీసెస్, ఇన్సూరెన్స్‌ (బీఎఫ్‌ఎస్‌ఐ) రంగంలో... 30 శాతం కంటే ఎక్కువ మంది నిపుణులు మానసిక ఆరోగ్య కారణాల వల్ల సెలవు తీసుకోవడానికి సంసిద్ధంగానే ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే డిజైన్, హాస్పిటాలిటీ వంటి రంగాల్లో ఇది అధికంగానే ఉన్నట్టుగా తెలిసింది. ఈ విషయంలో ఫ్రెషర్లు, కెరీర్‌ ప్రారంభంలో ఉన్న నిపుణులు (0–5 సంవత్సరాల పని అనుభవం) ఎక్కువగా సంకోచిస్తారు.

ఉద్యోగులు వెనుకాడడానికి కారణాలు... 
»  మానసిక ఆరోగ్యం సరిగాలేని కారణంగా సెలవు తీసుకుంటే తమను అసమర్థులుగా చూస్తారని 31 శాతం మంది ఉద్యోగులు భయపడుతున్నారు 
»    తమ విషయంలో సహోద్యోగులు ఏమని ఆలోచిస్తారోననే ఆందోళనతో 27% మంది ఉన్నారు 
»   సెలవు తీసుకునేందుకు తాము సాకులు వెతుకుతున్నామని 21% మంది ఆందోళన చెందుతున్నారు 
»  ఇది కెరీర్‌ వృద్ధిని ప్రభావితం చేస్తుందని 21% మంది నమ్ముతున్నారు 

వాస్తవాలకు బదులు సెలవుకు చెబుతున్న కారణాలు... 
»  తమ మానసిక ఆందోళనలతో తలెత్తిన పరిస్థితిని 45% జనరల్‌ సిక్‌ లీవ్‌గా పరిగణన
»  28% ఇతర కారణాలు 
»  19% సెలవులకు దూరం
» 9% ఇతర కారణాలు చూపుతున్నారు... 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)