Breaking News

'మహాలక్ష్మి' కోసం మహిళల నిరీక్షణ..

Published on Mon, 06/03/2024 - 10:33

నిజామాబాద్: అర్హులైన మహిళలకు ప్రతి నెలా రూ. 2,500ల చొప్పున ఆర్థిక సాయం అందించడానికి నిర్దేశించిన మహాలక్ష్మి పథకాన్ని రేవంత్‌రెడ్డి సర్కారు ఇంకా పచ్చజెండా ఊపలేదు. ఫలితంగా ఈ పథకం కింద సాయం కోసం ఎంతో మంది మహిళలు నిరీక్షిస్తున్నారు. ప్రధానంగా ఆసరా పథకం కింద పింఛన్‌ అందుకోలేని మహిళలు తమకు మహాలక్ష్మి సాయం కొండంత అండగా ఉంటుందని ఆశతో ఎదురుచూస్తున్నారు.

కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో మహాలక్ష్మి పథకం కింద ప్రతినెలా ఆర్థిక సాయం అందిచడం ఒకటి. 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆరు గ్యారంటీల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 53,196 కోట్లను కేటాయించింది. ఆసరా పథకం కింద జిల్లాలో 77,158 మంది వితంతువులు, 10,520 మంది ఒంటరి మహిళలు, 96,264 మంది బీడీ కారి్మకులు ప్రతినెలా పింఛన్లను అందుకుంటున్నారు.

వృద్ధాప్య, వికలాంగులు పింఛన్లలోనూ కొంత మంది అర్హులైన మహిళలు ఉన్నారు. జిల్లాలో 7,18,603 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. వీరిలో ఆసరా పింఛన్లను అందుకోలేని మహిళలు మహాలక్ష్మి సాయం ద్వారా లబ్ధి పొందవచ్చని భావిస్తున్నారు. ఇప్పటి వరకు మార్గదర్శకాలను రూపొందించకపోవడంతో మహాలక్ష్మి సాయం ఎంత మందికి వస్తుంది, ఎవరు అర్హులనే విషయం తేలుతుంది. అసలు మహాలక్ష్మి పథకం అమలు చేస్తారా లేదా అనే అంశంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఇప్పటి వరకు క్షేత్రస్థాయిలో ఎలాంటి సర్వే జరపకపోవడం, అర్హుల ఎంపికకు చర్యలు తీసుకోకపోవడంతో పథకం అమలుపై నీలినీడలు కమ్ముకున్నాయి. పార్లమెంట్‌ ఎన్నికల తంతు ఎలాగూ ముగిసిపోయింది. మరో వారం రోజుల్లో కోడ్‌ ఎత్తివేసే అవకాశం ఉంది. అప్పటికైనా మహాలక్ష్మి సాయంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని పలువురు కోరుతున్నారు.

ఇవి చదవండి: సీఎం రేవంత్‌రెడ్డి.. దీనికి ఏం సమాధానం చెప్తారు?: కేటీఆర్‌

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)