Breaking News

పటాన్‌చెరు ఓఆర్‌ఆర్‌ పరిధిలో మహిళ దారుణ హత్య

Published on Fri, 07/17/2026 - 11:54

మెదక్‌, పటాన్‌చెరు: ఓఆర్‌ఆర్‌ సర్వీస్‌ రోడ్డు చెట్ల పొదల్లో ఓ మహిళను దారుణంగా హత్య చేసిన ఘటన పటాన్‌చెరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో వెలుగుచూసింది.  సదాశివపేటకు చెందిన మంజుల(45) 15 ఏళ్ల క్రితం భర్త చనిపోవడంతో బతుకుదెరువు కోసం ఇద్దరు కొడుకులను తీసుకుని జీ.పీ డివిజన్‌ పరిధిలోని అంబేడ్కర్‌ కాలనీకి వచ్చి ఉంటూ, స్థానికంగా మేస్త్రీ కింద కూలిపని చేస్తుంది. ఇద్దరు కుమారులు కూడా కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

ఈ క్రమంలో బుధవారం సాయంత్రం అంబేడ్కర్‌ కాలనీ ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కాగా గురువారం ఉదయం పటాన్‌చెరు శివారులో ఓఆర్‌ఆర్‌ సర్వీస్‌ రోడ్‌లో పక్కన మహిళ హత్యకు గురైందని సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు మంజుల తలకు, కంటికి తీవ్ర గాయాలు ఉన్నట్లు గుర్తించారు. గుర్తుతెలియని వ్యక్తులు ఆమెను అక్కడికి తీసుకువచ్చి తలపై బలంగా దాడి చేసి హత్య చేసి ఉండవచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. 

మృతురాలు ధరించిన దుస్తులు కూడా చిరిగిపోయి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలాన్ని క్లూస్‌ టీమ్, ఫోరెన్సిక్‌ బృందం, డీసీపీ చింతమనేని శ్రీనివాస్, ఏసీపీ శ్రీనివాస్, సీఐ వినాయక్‌ రెడ్డి, సిబ్బందితో కలసి పరిశీలించి ఆధారాలు సేకరించారు. హత్యకు గల కారణాలు, ఘటనకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)