Breaking News

భర్త ఇంటికి లేటుగా వచ్చాడని.. బాత్‌రూమ్‌లోకి వెళ్లి యాసిడ్‌..

Published on Tue, 12/20/2022 - 08:15

సాక్షి, పటాన్‌చెరు టౌన్‌: భర్త ఇంటికి లేటుగా వచ్చాడని మనస్తాపం చెందిన భార్య యాసిడ్‌ తాగి, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ ఘటన పటాన్‌చెరు పోలీసు స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ రామనాయుడు వివరాల ప్రకారం ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రం గాజిపూర్‌ జిల్లాకు చెందిన రవీంద్ర, భార్య అంజులదేవి(28)తో కలిసి బతుకుదెరువు నిమిత్తం పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్‌లో ఓ కిరాణ షాపులో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

ఈ నెల 18న రవీంద్ర ఇంట్లో టిఫిన్‌ తినకుండా షాపుకు వెళ్లాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన భర్తతో అంజుల దేవి మధ్యాహ్న భోజనానికి ఎందుకు రాలేదని అరుస్తూ బాత్‌రూమ్‌లోకి వెళ్లి యాసిడ్‌ తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు పటాన్‌చెరులో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతిచెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 

చేర్యాలలో..
చేర్యాల(సిద్దిపేట): చేర్యాల మండలం ఆకునూరులో ఆత్మహత్యకు పాల్పడిన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందాడు. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన బోయిని శేఖర్‌(32) ఈ నెల 15న పురుగుల మంది తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందాడు. మృతుడి భార్య కావ్య ప్రస్తుతం 5నెలల గర్భిణి. కాగా మృతుడి తండ్రి నర్సయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

Videos

Vizianagaram: పలుచోట్ల బాంబు పేలుళ్లకు కుట్ర చేసినట్లు సిరాజ్ అంగీకారం

విగ్రహానికి టీడీపీ జెండాలు కట్టడంపై అవినాష్ రెడ్డి ఫైర్

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

Mahanadu: డ్వాక్రా సంఘాలకు బెదిరింపులు

ప్రభుత్వ స్కూళ్లలొ చదువులు అటకెక్కాయి: YS జగన్

మేడిగడ్డ బ్యారేజీపై NDSA ఇచ్చిన నివేదిక అంతా బూటకం: కేటీఆర్

సినిమాలతో ప్రభుత్వానికి ఏం సంబంధం అని గతంలో పవన్ కళ్యాణ్ అన్నారు

రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలి: YS జగన్

అల్లు అరవింద్ లీజు థియేటర్లన్నింటిలోనూ తనిఖీలు

కడపలోనే మహానాడు పెడతావా..! వడ్డీతో సహా చెల్లిస్తా...

Photos

+5

జబర్దస్త్ ఐశ్వర్య నూతన గృహప్రవేశ వేడుక (ఫొటోలు)

+5

కామాఖ్య ఆలయాన్ని సందర్శించిన హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ (ఫొటోలు)

+5

మహానాడులో చంద్రబాబు మహానటన (ఫొటోలు)

+5

పిఠాపురం : కుక్కుటేశ్వర స్వామి ఆలయాన్ని మీరు ఎప్పుడైనా సంద‌ర్శించారా? (ఫొటోలు)

+5

NTR Jayanthi : ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద జూ. ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ నివాళి (చిత్రాలు)

+5

వోగ్ బ్యూటీ అవార్డ్స్ లో మెరిసిన సమంత, సారా టెండూల్కర్ (ఫొటోలు)

+5

భర్త బర్త్‌ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ సోహా అలీ ఖాన్ (ఫొటోలు)

+5

మదర్ డ్యూటీలో కాజల్.. కొడుకుతో కలిసి ఇలా (ఫొటోలు)

+5

సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిర్మాత దిల్ రాజు (ఫొటోలు)

+5

ఆర్జే కాజల్ గృహప్రవేశంలో ప్రియాంక సింగ్ సందడి (ఫొటోలు)